పుట:Shodashakumaara-charitramu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

షోడశకుమారచరిత్రము


వోలె వచ్చి నాప్రాణంబులు గాచితివి, నీయధీనంబ నైతి నీచిత్తంబుకొలఁది నడవంగలదాన నని విన్నవించిన నతండు.

31


క.

నిను దోడుకొనుచుఁ జని నీ
జనకున కొప్పించి యిచ్చఁ జనియెద నని య
వ్వనజాయతలోచనఁ దో
డ్కొని తెలతెల వేగునంతకును బురి కరిగెన్.

32


వ.

అరిగి రాజమందిరద్వారంబున నిలిచి యాకాంత నంతఃపురంబులోపలికిం బనిచిన శోకవేగంబున బలవించుచున్న తజ్జననీజనకుల పాలికిం జని తన వృత్తాంతం బంతయు నెఱింగించిన సంభ్రమించి.

33


క.

మనమున నత్యద్భుతమును
ఘనమోదము నుల్లసిల్లఁగా నప్పుడ యా
తని దోడి తెచ్చి గౌరవ
మెనయఁగ నర్ధాససమున నిడికొని ప్రీతిన్.

34


వ.

తద్వృత్తాంతం బడిగి యతండు చెప్ప నంతయు నాకర్ణించి కులపౌరుషంబుల నధికుంగా నెఱింగి యుల్లంబున నుల్లసిల్లి.

35


గీ.

ప్రాణదానం బొనంగితి వట్లుగాన
సౌసుతకు నీవ తగుప్రాణనాయకుండ
వఖలగుణములయందు నత్యాధికుండు
వరుఁడు నీకంటెఁ గలఁడె యీవనజముఖికి.

36


వ.

కావున నీరాజవదన వరియింఛి నారాజ్యలక్ష్మి కధ్యక్షుండవై యుండు మని యత్యంతప్రియపూర్వకముగాఁ బ్రార్థించిన.

37