పుట:Shodashakumaara-charitramu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

123


క.

వంధ్యోద్యమఖిన్నతమై
వింధ్యాటవి నతఁడు మిమ్ము వెదకి తిరుగుచున్
సంధ్యాసమయంబునఁ ద
ద్వింధ్యనిలయగృహము చేరి విధి కడలుతఱిన్.

26


వ.

విస్తారోదారం బైన యయ్యగారంబున నొక్క దిక్కున నర్ధరాత్రసమయంబున.

27


క.

సాధకుఁ డొకరుం డొకబిం
బాధరఁ గొనివచ్చి యేమి యర్థించియొ య
మ్మాధవికి బలియొనర్చుట
కై ధృతిలే కడలఁ బట్టి కట్టి తెగువ మై.

28


క.

కరవాల మెత్తుటయు మదిఁ
గరుణ వొడమ ధానిఁ జూచి గ్రక్కున శౌర్యో
ద్ధురుఁడై బలువిడి నాతని
శిరము దునిమి దేవికి బలి చేసి వినతుఁడై.

29


క.

ఆవనితకట్టు లూడిచి
భావము వెఱ వాయఁ బలికి పద్మనయన నీ
వేవానిసుతవు నిను వీఁ
డేవిధమునఁ దెచ్చె నాకు నెఱిఁగింపు మనన్.

30


వ.

భయసంభ్రమంబులు మనంబున ముప్పిరిగొన నప్పయోరుహలోచన నేను మాణిక్యపురాధీశ్వరుం డైన రత్నకేతుని తనూభవను రత్నప్రభ యనుదానను నేఁటి సంధ్యాసమయంబున మహోత్సేధం బగు సౌథాగ్రతలంబున నిద్రింప నిద్దురాత్ముండు నన్ను నెత్తికొనితెచ్చి యచ్చట ని ట్లొనర్పనిడికొనియున్నవాఁ డింతలో నీవు నాపాలిభాగ్యదేవతవు