పుట:Shodashakumaara-charitramu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

షోడశకుమారచరిత్రము


య్యలఘునిశాటుమ్రోలఁ జెలువారెడు నాసతిఁ జూచి వానిదో
ర్బల మొకచీరికిం గొనక రాగముఁ గౌతుకముం దలిర్పఁగన్.

20


క.

తప్పక చూచుచు నుండఁగ
నప్పొలఁతియు నన్నుఁ గాంచి యనురాగముతో
ఱెప్పయిడక కనుఁగొనఁగా
నప్పుడు నామీఁదఁ గడఁగె నసుర యలుకమై.

21


క.

సురవైరిఁ జూచి యేనును
గర మలుకఁ గరాసి నెఱికి కమలాకరభూ
వరుబంట దీర్ఘబాహుఁడ
నురుతరముగ నన్నుఁ జూచె దోరినిశాటా.

22


గీ.

అనిన దైత్యుండు తనయాగ్రహంబు విడిచి
యీవు కమలాకరుని బంటవేని నేను
నీదుకూరిమిచెలిమామ నిన్ను వెదుక
నరుగుదెంచితి ననిఁ బ్రియంబునొంది.

23


క.

ఏమిత్రుమామ ననుటయు
ధీమహితుం డైనయట్టి దృఢముష్టికి నే
మామ నని చెప్పుటయు నే
నామోదతరంగితాంతరంగుఁడ నగుచున్.

24


వ.

అతం డేమికతంబున నీకు నల్లుం డయ్యె నిప్పు డెచ్చట నున్నవాఁడు చెప్పవయ్య యని యడిగినఁ దద్వృత్తాంతం బతనిచేత నేవిన్నదియు నేనుం గన్నదియును వివరించెద నాకర్ణింపుము.

25