పుట:Saundarya-Lahari.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

సౌందర్యలహరి

టీ. హేఅమ్బ = ఓయమ్మా, తే = నీయొక్క, కుచాభోగః-కుచ = స్తనములయొక్క, ఆభోగః = విస్తారము, స్తమ్బేరమదనుజకుమ్భప్రకృతిభిః-స్తమ్బేరమదనుజ = గజాసురునియొక్క, కుమ్భ = కుంభములే, ప్రకృతిభిః = పుట్టుకగాఁగల, ముక్తామణిభిః = ముత్యములచేత, సమారబ్ధాం = కూర్పఁబడినదియు, అమలాం = త్రాసాదిమణిదోషములు లేక విమలమైనదియు, బిమ్బాధరరుచిభిః-బిమ్బాధర = దొండపండువంటియధరముయొక్క, రుచిభిః = రంగులచేత, అన్తః = లోపల, శబలితాం = చిత్రవర్ణముగలదిగాఁజేయఁబడిన, హారలతికాం = తీఁగెవంటి హారమును, పురదమయితుః = ఈశ్వరునియొక్క, ప్రతాపవ్యామిశ్రాం = పరాక్రమముతోఁగూడిన, కీర్తిమివ = కీర్తినివలె, వహతి = తాల్చుచున్నది.

తా. అమ్మా, గజాసురుని కుమ్భములయందలి ముత్యములచేఁ గూర్చఁబడిన నీ మెడయందలి తెల్లనిహారము నీ యధరకాంతులచే లోపలనెఱ్ఱవాఱినదై ఎఱ్ఱని ప్రతాపముతోఁగలిసినయీశ్వరుని తెల్లనికీర్తివలె నున్నది.

తవ స్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః
పయఃపారావారం పరివహతి సారస్వతమివ,
దయావత్యా దత్తం ద్రవిడశిశురాస్వాద్య తవ య
త్కవీనాం ప్రౌఢానామజని కమనీయః కవయితా. 75

టీ. హేధరణిధరకన్యే = హిమవంతునిపట్టియగు నోదేవీ, అహం = నేను, తవ = నీయొక్క, స్తన్యమ్ = చనుఁబాలను, హృదయతః = హృదయమువలనఁబుట్టిన, పయఃపారావారమ్ = పాలకడలి, సారస్వతమివ = వాఙ్మయ విలాసమువలె, పరివహతి = మాఱిపారుచున్నది, ఇతి = అని, మన్యే = తలఁచెదను, యత్ = ఏకారణమువలన, దయావత్యా = ప్రేమగలనీచేత, దత్తం = ఈయఁబడిన, తవ = నీయొక్క, స్తన్యం = స్తన్యమును, అస్వాద్య = త్రావి, ద్రవిడశిశుః = అఱవకుఱ్ఱఁడు (శ్రీశంకరులు), ప్రౌఢానాం = గడుసరులగు, కవీనామ్ = కవులనడుమ, కమనీయిః = సర్వజగన్మోహకుఁడైన, కవయితా = కవిగా, అజని = ఆయెనో.