పుట:Saundarya-Lahari.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

59

తా. తల్లీ, నీచనుఁబాలను చూచి నేను నీహృదయమందలి పాలకడలిపైకి కావ్యనాటకాదిరూపమై ప్రవహించుచున్న వాఙ్మయమునుగా నెన్నెదను. కాదేని నీవిచ్చిన చనుఁబాలనుద్రావి యీయఱవబాలుఁడు గడుసుకవులందఱిలో నొకరంజకుఁడగు మహాకవి గానేల?

హరక్రోధజ్వాలావళిభిరవలీఢేన వపుషా
గభీరే తే నాభీసరసి కృతసఙ్గో మనసిజః,
సముత్తస్థౌ తస్మాదచలతనయే ధూమలతికా
జనస్తాం జానీతే జనని తవ రోమావళిరితి. 76

టీ. హేఅచలతనయే = ఓపార్వతీ, మనసిజః = మన్మథుఁడు, హరక్రోధజ్వాలావళిభిః-హర = రుద్రునియొక్క, క్రోధ = కోపాగ్నియొక్క, జ్వాలా = మంటలయొక్క, అవళిభిః = పంక్తులచేత, అవలీఢేన = చుట్టఁబడిన, వపుషా = మేనితోడ, గభీరే = లోఁతగు, తే = నీయొక్క, నాభీసరసి = బొడ్డు మడుపున, కృతసఙ్గః-కృత = చేయఁబడిన, సఙ్గః = వసతిగలవాఁడాయెను. తస్మాత్ = ఆకాలుచున్నమన్మథునిశరీరమునుండి, ధూమలతికా = పొగతీఁగె, సముత్తస్థౌ = లేచెను, హేజనని = ఓయమ్మా, జనః = లోకము, తాం = ఆపొగ జాలును, తవ = నీయొక్క, రోమావళిరితి = నూఁగారని, జానీతే = తెలియుచున్నది.

తా. తల్లీ, హరునికోపాగ్నిచే యొడలునుండి మదనుఁడు ప్రాణముల గాచుకోఁదలఁచి లోఁతైన నీబొడ్డుమడువులో దుమికి యొడలుదాఁచికొనెను. వానియొడలినుండి వెడలిన యీపొగనే పామరజనము నీనూఁగారని చెప్పుచున్నది.

యదేతత్కాళిన్దీతనుతరతరఙ్గాకృతి శివే
కృశే మధ్యే కిఞ్చిత్తవ జనని యద్భాతి సుధియాం,
విమర్దాదన్యోన్యం కుచకలశయో రన్తరగతం
తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీమ్. 77