పుట:Saundarya-Lahari.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

సౌందర్యలహరి

టీ. హేజననిశివే = ఓయమ్మపార్వతీ, తవ = నీయొక్క, కృశే = సన్నగిలిన, మధ్యే = నడుమునందు, యదేతత్ = ఏయీ, కాళిన్దీతనుతరతరఙ్గాకృతి-కాళిన్దీ = యమునానదియొక్క, తనుతర = మిగులచిన్నదగు, తరఙ్గ = అలయొక్క, ఆకృతి = రూపమువంటిరూపముగల, యత్ = ఏ, కించిత్ = రోమాళియనునొక చిన్నవస్తువు, సుధియాం = విమర్శించిచూచువారలకు, భాతి = కనుపట్టుచున్నదో, కుచకలశయోః = బిందెలవంటి స్తనములయొక్క, అన్తరగతం = మధ్యనున్న, వ్యోమ = ఆకాశము, అన్యోన్యం = ఒకటితోనొకటి, విమర్దాత్ = ఒఱియుటవలన, తనూభూతం = సన్ననైనదై, కుహరిణీం = గుహగల, నాభిం = బొడ్డును, ప్రవిశ దివ = దూరినదానివలె, ఆభాతి = తోఁచుచున్నది.

తా. అమ్మా, యమునాతరంగమువలె నల్లనై సన్ననైన నీనడుమునందగపడుఆరను నీసూక్ష్మవస్తు వెద్దియని యోజింపఁగా నీస్తనమధ్యనున్న యాకాశము (ఎడము) ఆరెండును కాలక్రమముచే నొకటినొకటియొఱయుచుండఁగాఁ దన కచటచోటుచాలక లక్కవలె క్రిందికిజాఱి గుహవలెనున్న బొడ్డులోదూరిన యాకసమా యనునట్లున్నది. ఆకసమునకు నొకరూపము గలిగి నల్లనై యుండుట లోకవిదితము.

స్థిరో గఙ్గావర్తస్స్తనముకుళరోమావళిలతా
కళావాలం కుణ్డం కుసుమశరతేజోహుతభుజః,
రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే
బిలద్వారం సిద్ధేర్గిరిశనయనానాం విజయతే. 78

టీ. హేగిరిసుతే = ఓపార్వతీ, తవ = నీయొక్క, నాభిః = బొడ్డు, స్థిరః = చలనమునొందని, గఙ్గావర్తః-గఙ్గా = గంగానదియొక్క, ఆవర్తః = నీటి సుడి, స్తనముకుళరోమావళిలతాకళావాలం-స్తన = పాలిండ్లనే, ముకుళ = పూమొగ్గలకాధారమైన, రోమావళిలతా = రోమరాజియను తీఁగెయొక్క, కళా = రేఖకు, ఆవాలం = పాదు, కుసుమశరతేజోహుతభుకః-కుసుమశర = మన్మథునియొక్క, తేజః = ప్రకాశమనెడు, హుతభుజః =అగ్నికి, కుణ్డం =