పుట:Saundarya-Lahari.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

57


ముక్కుల పాలుగారుచున్న యేచంటిజంటనుజూచి విఘ్నేశ్వరుఁడు చిన్నతనమువలననైన యవివేకముచే నవి తనకుంభములనుకొని తమయమ్మ వాని నపహరించెనేమోయని తలంచి తనకుంభము లున్నవో లేవో యని చేతులచేఁ దడవికొని ముద్దుఁజూపుచుఁ దల్లిదండ్రులగు మిమ్ము నవ్వించునో.

అమూ తే వక్షో జావమృతరసమాణిక్యకుతుపౌ
న సన్దేహస్పన్దో నగపతిపతాకే మనసి నః,
పిబన్తౌ తౌ యస్మాదవిదితవధూసఙ్గరసికౌ
కుమారావద్యాపి ద్విరదవదనక్రౌఞ్చదళనౌ. 73

టీ. హేనగపతిపతాకే = హిమవంతునివిజయధ్వజమగు తల్లీ, అమూ = ఈయగపడుచున్న, తే = నీయొక్క, వక్షోజౌ = చనులు, అమృతరసమాణిక్యకుతుపౌ-అమృతరస = అమృతముచేనిండిన, మాణిక్యకుతుపౌ = కెంపులచేఁ జేయఁబడినసిద్దెలు, నః = మాయొక్క, మనసి = చిత్తమున, సన్దేహస్పన్దః = సంశయలేశమున్ను, న = లేదు, యస్మాత్ = ఏకారణమువలన, తౌ = ఆ స్తనములను, పిబన్తౌ = త్రాగిన, ద్విరదవదనక్రౌఞ్చదళనౌ = విఘ్నేశ్వరకుమారస్వాములు, అవిదితవధూసఙ్గరసికౌ-అవిదిత = తెలియని, వధూసఙ్గ = తరుణులకూటమి యందలి, రసికౌ = రుచిగలవారై, అద్యాపి = ఇప్పటికిని, కుమారౌ = బాలురుగా నుందురో.

తా. తల్లీ, నీయీస్తనములు కెంపులతోఁ జేయఁబడిన యమృతపు గుండిగలే, ఇందు మాకేసందియమునులేదు. కాకున్న వీనియందలి స్తన్యమును గ్రోలిన విఘ్నేశ్వరుఁడును కుమారస్వామియు ఇప్పటికిని బాలురై వధూసంగమును గోరకుందురా!

వహత్యమ్బ స్తమ్బేరమదనుజకుమ్భపకృతిభిః
సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికామ్,
కుచాభోగో బిమ్బాధరరుచిభిరన్తశ్శబలితాం
ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివ తే. 74