పుట:Saundarya-Lahari.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

సౌందర్యలహరి


శముచేతనైనను, సామ్యం = పోలికను, భజతు = పొందునా, హన్త = అయ్యో, క్రీడల్లక్ష్మీచరణతలలాక్షారసచణమ్-క్రీడత్ = విహారించుచున్న, లక్ష్మీ = లక్ష్మీదేవియొక్క, చరణతల = పాదములయందలి, లాక్షారస = లత్తుకతోడ, చణం = కూడినదేని, సామ్యం = పోలికను, భజతి = పొందునేమోగదా.

తా. తల్లీ, గోళ్లరంగులచేత అప్పుడువిచ్చిన కమలమునుసైతము తిరస్కరించుచున్న నీ చేతులను అయ్యో! కమల మేపాలుచేతనైనఁ బోలునా, పోలదు. అక్కడమెలఁగెడులక్ష్మి యొక్క కాళ్ల యందలిలత్తుక కొంత దగిలెనేని యప్పుడు కొంతసాటియగునేమో చెప్పఁజాలము.

సమం దేవి స్కన్దద్విపవదనపీతం స్తనయుగం
తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుతముఖమ్,
యదాలోక్యా శఙ్కాకులితహృదయో హాసజనకః
స్వకుమ్భౌ హేరమ్బః పరిమృశతి హస్తేన ఝటితి 72

టీ. హేదేవి = ఆటలయందు ప్రీతిగల యోయమ్మా, సమం = ఒక్కమాఱుగా, స్కన్దద్విపవదనపీతం-స్కన్ద = కుమారస్వామిచేతను, ద్విపవదన = విఘ్నేశ్వరునిచేతను, పీతం = కుడువఁబడిన, తవ = నీయొక్క, ఇదం = ఈ, స్తనయుగం = కుచద్వందము, సతతం = ఎల్లప్పుడును, నః = మాయొక్క, ఖేదం = దుఃఖమును, హరతు = సమయించుఁగాక, ప్రస్నుతముఖం-ప్రస్నుత = పాలుకారుచున్న, ముఖం = ముక్కు(చూచుకము)లుగల, యత్ = ఏపాలిండ్లజతను, ఆలోక్య = చూచి, హేరమ్బః = విఘ్నేశ్వరుఁడు, ఆశఙ్కాకులితహృదయః-ఆశఙ్కా = (తమయమ్మ తనకుంభములను తీసికొన్నదేమోయను) బెదురుచేత, ఆకులిత = కలఁతవడిన, హృదయః = చిత్తముగలవాఁడై, హాసజనకః = నవ్వునుగలిగించువాఁడై, హస్తేన = చేతితో, ఝటితి = వేగముగా, స్వకుమ్భౌ = తనకుంభస్థలములను, పరిమృశతి = తడవుకొనుచున్నాఁడో.

తా. తల్లీ! కుమారస్వామిచేతను, విఘ్నేశ్వరునిచేతను ఒక్కమాఱే త్రాగఁబడుచున్న నీకుచద్వయము మాకష్టముల నణఁచి మేలునిచ్చుగాక,