పుట:Saundarya-Lahari.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

55


మృణాళీమృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం
చతుర్భిస్సౌన్దర్యం సరసిజభవస్స్తౌతి వదనైః,
నఖేభ్యస్సన్త్రస్యన్ ప్రథమమథనాదంధకరిపో
శ్చతుర్ణాం శీర్షాణాం సమమభయహస్తార్పణధియా. 70

టీ. హేభగవతి = ఓదేవి, సరసిజభవః = బ్రహ్మ, ప్రథమమథనాత్ = పూర్వము తలనుగోయుటవలన, అంధకరిపోః = శివునియొక్క, నఖేభ్యః = గోళ్లవలన, సంత్రస్యన్ = భయమొందినవాఁడై, చతుర్ణాం = నాలుగగు, శీర్షాణాం = తలలకు, సమం = ఒక్కమాఱే, అభయహస్తార్పణధియా = అభయహస్తములనిచ్చునను తలఁపుచేత, చతుర్భిః = నాలుగు, వదనైః = నోరులచేత, మృణాళీమృద్వీనామ్-మృణాళీ = తామరకాఁడలవలె, మృద్వీనాం = సుకుమారములైన, చతసృణాం = నాలుగగు, తవ = నీయొక్క, భుజలతానాం = తీఁగెలవంటి బాహువులయొక్క, సౌన్దర్యం = సొబగును, స్తౌతి = పొగడుచున్నాఁడు.

తా. తల్లీ, బ్రహ్మదేవుఁడు పూర్వము తలద్రెంపిన శివునిగోళ్లకు భయపడి తననాలుగుతలలకు నొక్కమాఱే యభయమును గొనఁదలఁచి నాలుగు మోములచేతను, నీబాహువులయందమును వర్ణించుచున్నాఁడు.

నఖానాముద్యోతైర్నవనళినరాగం విహసతాం
కరాణాం తే కాన్తిం కథయ కథయామః కథముమే,
కయాచిద్వా సామ్యం భజతు కలయా హన్త కమలం
యది క్రీడల్లక్ష్మీచరణతలలాక్షారసచణమ్. 71

టీ. హేఉమే = ఓపార్వతీ, నఖానాం = గోళ్లయొక్క, ఉద్యోతైః = వెలుఁగులచేత, నవనళినరాగమ్-నవ = అప్పుడుపూఁచిన, నళిన = కమలములయొక్క, రాగం = రంగును, విహసతాం = గేలిసేయుచున్న, తే = నీయొక్క, కరాణాం = చేతులయొక్క, కాన్తిం = శోభను, కథం = ఎట్లు, కథయామః = వర్ణింతుము, కథయ = చెప్పుము. కమలం = తామరపూవు, కయాచిద్వాకలయా = ఏలే