పుట:Saundarya-Lahari.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

33


యా = విలసనముగల, శక్త్యా = తటిద్రూపశక్తిచేత, తటిత్వన్తం = మెఱపులుగల, స్ఫురన్నానారత్నాభరణపరిణద్ధేన్ద్రధనుషమ్-స్ఫురత్ = మెఱయుచున్న, నానారత్న = పలురత్నములచే నిర్మించఁబడిన, ఆభరణ = సొమ్ములచేత, పరిణద్ధ = కూర్చఁబడిన, ఇన్ద్రధనుషమ్ = ఇంద్రచాపముగల, శ్యామం = నల్లనిమేఘమువలెనున్న, హరమిహిరతప్తమ్-హర = ఈశ్వరుఁడనే, మిహిర = సూర్యుని (ప్రళయానలము)చేత, తప్తమ్ = క్రాంచఁబడిన, త్రిభువనమ్ = ముల్లోకములను, వర్షన్తమ్ = తడుపుచున్న, కమని = ఇట్టిదట్టిదనరాని, మేఘమ్ = మొయిలును, నిషేవే = సేవించెదను.

తా. తల్లీ, నీమణిపూరచక్రముననుండి యందలిచీఁకటిని బాపఁగల విద్యుద్రూపశక్తితోఁ గూడి, పలుచెఱఁగుల రత్నపుసొమ్ములచేఁ గల్పింపఁబడిన యింద్రదనుస్సు గలిగియున్న శివుఁడనేప్రళయానలముచేఁ గాల్చఁబడినజగత్తును తడిపి చల్లఁబఱచుచున్న యనిర్వాచ్యమహిమగలవార్షుకమేఘమును (సదాశివుని) సేవించెదను.

తవాథారే మూలే సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే నవరసమహాతాణ్డవనటమ్,
ఉభాభ్యామేతాభ్యాముదయవిధిముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జజ్ఞే జనకజననీనుజ్జగదిదమ్. 41

టీ. హేభగవతి = ఓదేవీ, తవ = నీయొక్క, మూలేఆధారే = మూలాధారచక్రమందు, లాస్యపరయా = ఆడఁగోరికగల (స్త్రీనృత్యము లాస్యమునఁబడు), సమయయాసహ = సమయయనుకళతోఁ గూడ, నవరసమహాతాణ్డవనటమ్-నవ = తొమ్మిదగు, రస = శృంగారాదిరసములచేతనైన, తాణ్డవ = ఆట యందు, (పురుషనృత్తము తాండవమనఁబడు.) నటమ్ = ఆటకాఁడగువానిని, నవాత్మానమ్ = ఆనందభైరవునిఁగా, మన్యే = తలఁచెదను, ఉదయవిధిమ్ = అభ్యుదయవ్యాపారమును, ఉద్దిశ్య = నిశ్చయించి, దయయా = కాలినలోకము నుజ్జీవింపఁజేయుకరుణచేత, సనాధాభ్యాం = ఒకటిగాఁగలసిన, ఏతాభ్యామ్ = ఈయానందభైరవి భైరవులచేత, ఇదమ్ = ఈ, జగత్ = లోకము, జనకజననీమత్ = తల్లిదండ్రులుగలదిగా, జిజ్ఞే = అయ్యెను.