పుట:Saundarya-Lahari.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

సౌందర్యలహరి


తవ స్వాధిష్ఠానే హుతవహమధిష్ఠాయ నిరతం
తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయామ్,
యదాలోకే లోకాన్ దహతి మహసి క్రోధకలితే
దయార్ద్రాయా దృష్టిశ్శిశిరముపచారం రచయతి. 39

టీ. హేభగవతి = ఓతల్లీ, తవ = నీయొక్క, స్వాధిష్ఠానే = స్వాధిష్ఠానచక్రమందు, తంసవర్తంహుతవహం = ఆప్రళయాగ్నిని, అధిష్ఠాయ = ఆశ్రయించి, నిరతం = ఎల్లవేళలను, ఈడే = స్తుతించెదను, మహతీం = మహతియనఁబడు, తాం = ఆసంవర్తాగ్నిరూపమైన, సమయాం = సమయయనుకళను, ఈడే = స్తుతించెదను, మహసి = తేజోరూపమగు, క్రోధకలితే = రోషరూషితమయిన, యదాలోకే-యత్ = ఏకళయొక్క, ఆలోకే = దృష్టి, లోకాన్ = జగములను, దహతిసతి = కాల్చుచుండఁగా, దయార్ద్రా = కృపచేఁ జెమ్మగిలిన, యా = ఏ, దృష్టిః = చూపు, శిశిరం = చల్లని, ఉపచారం = సేవను, రచయతి = కల్పించుచున్నదో.

తా. ఏశక్తియొక్క క్రోధయుతమగుచూపు లోకములను దహింపఁగా కరుణాకల్పితమైన యాచూపే మఱల చల్లఁబఱచుచుండునో అనాహతచక్రగతమైన యగ్ని నాశ్రయించిన ప్రళయానలజ్వాలారూపమైన యాశివశక్తిని సేవించెదను.

తటిత్వన్తం శక్త్యా తిమిరపరిపన్థిస్ఫురణయా
స్ఫురన్నానారత్నాభరణపరిణద్ధేన్ద్రధనుషం,
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం
నిషేవేవర్షన్తం హరమిహిరతప్తం త్రిభువనమ్. 40

టీ. హేభగవతి = ఓతల్లీ, తవ = నీయొక్క, మణిపూరైకశరణం-మణిపూర = మణిపూరచక్రమై, ఏక = ముఖ్యమైన, శరణం = నెలవుగాఁగల, (మణి యనఁగా విల్లు దానిచేఁ బూరింపఁబడునదిమణిపూరము) తిమిరపరిపంథిస్ఫురణయా-తిమిర = మణిపూరమందలి చీఁకటికి, పరిపంథి = విరోధియగు, స్ఫురణ