పుట:Saundarya-Lahari.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

సౌందర్యలహరి

తా. తల్లీ, నీమూలాధారచక్రమందు నృత్యవశగురాలగు సమయకళతోఁగూడి నవరసనృత్యమందు దవిలియున్నవానిని యానందభైరవునిగాఁ దలంచెదను. దయచేత కాలినలోకమును ప్రోదిసేయ నొకటిగాఁ గలసిన యీయానందభైరవీభైరవులచేత నీయెల్లలోకములు తల్లియుఁ దండ్రియుఁ గలవిగా నైనవి.

గతైర్మాణిక్యత్వం గగనమణిభిస్సాన్ద్రఘటితం
కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః,
స నీడేయచ్ఛాయాచ్ఛురణశబలం చన్ద్రశకలం
ధనుశ్శౌనాసీరం కిమితి ననిబధ్నాతి ధిషణామ్. 42

టీ. హేహిమగిరిసుతే = ఓపార్వతీ, మాణిక్యత్వం = తొమ్మిది మానికములగుటను, గతైః = పొందిన, గగనమణిభిః = సూర్యులచేత, సాన్ద్రఘటితం = చిక్కనగాగూర్చఁబడిన, హైమం = బంగారపుదైన, తే = నీయొక్క, కిరీటం = మకుటమును, యః = ఎవఁడు, కీర్తయతి = వర్ణించునో, సః = ఆకవిపుంగవుఁడు, నీడేయచ్ఛాయాచ్ఛురణశబలం-నీడేయ = కుదుళ్లయందు బిగింపఁబడిన నానారత్నములయొక్క, ఛాయా = కాంతులయొక్క, ఛురణ = ప్రసారముచేత, శబలమ్ = చిత్రవర్ణముగల, చన్ద్రశకలం = చంద్రఖండమును, శౌనాసీరం = ఇంద్రునిదగు, ధనురితి = విల్లుని, ధిషణాం = ఊహను, కింననిబధ్నాతి = ఎందుకు చేయఁడు? చేయుననుట.

తా. తల్లీ, ద్వాదశాదిత్యుల లనెడుమణులచేత చిక్కనగాఁ జెక్కఁబడిన నీబంగారపుఁగిరీటము నెవఁడు భావనచేసి వర్ణింపఁజూచునో వాఁడు గాఁడులు దీసికట్టఁబడిన రత్నకాంతులచే పలువన్నెలుగల నీయౌదలనున్న చంద్రశకలమును జూచి యింద్రధనస్సని భ్రమజెందఁడా? చెందుననుట.

ధునోతు ధ్వాన్తం నస్తులితదళితేన్దీవరవనం
ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే,
యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో
వసన్త్యస్మిన్మన్యే వలమథనవాటీవిటపినామ్. 43