పుట:Saundarya-Lahari.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

25

టీ. హేనిత్యే = నిత్యురాలగు ఓభగవతీ, స్వదేహోద్భూతాభిః-స్వ = నీయొక్క, దేహ = దేహైకదేశమగు చరణమువలన, ఉద్భూతాభిః = పుట్టిన, ఘృణిభిః = కాంతులచేతను, అణిమాద్యాభిః = అణిమాదిశక్తులచేతను, అభితః = అంతటను, (పరివృతాం = చుట్టుకోఁబడిన) త్వాం = నిన్ను, అహం = నేను, నిషేవే = సేవించెదను, ఇతి = ఇట్లు, యః = ఏయుపాసకుఁడు, సదా = ఎల్లపుడు, భావయతి = ధ్యానించునో, త్రిణయనసమృద్ధిం-త్రిణయన = సాంబమూర్తియొక్క, సమృద్ధి = సంపదను, తృణయతః = గడ్డిపోఁచఁగాఁ దలంచుచున్న, తస్య = వానికి, మహాసంవర్తాగ్నిః = ప్రళయాగ్ని, నీరాజనవిధిం = ఆరతెత్తుటను, విరచయతి = చేయుచున్నది, (అత్ర = ఇట్లనుటయందు,) కిమాశ్చర్యం = ఏమియబ్బురము?

తా. తల్లీ, నిత్యురాలగు నిన్ను వెలుఁగుచున్న నీచరణకాంతులతోడను అణిమాదిశక్తులతోడను గూడినదానినిగా నిరంతరధ్యానముచేయువానికి శివుని యైశ్వర్యమే తృణప్రాయముదోఁచఁగా నిఁక వానికి ప్రళయాగ్ని యారతివలె నగుచున్న దనుటలో నేమివింత గలదు? ఏమియు లేదనుట.

చతుష్షష్ట్యా తన్త్రై స్సకలమతిసన్ధాయ భువనం
స్థితస్తత్తత్సిద్ధిప్రసవపరతన్త్రైః పశుపతిః,
పున స్త్వన్నిర్బన్ధా దఖిలపురుషార్థైకఘటనా
స్వతన్త్రం తే తన్త్రం క్షితితలమవాతీతరదిదమ్. 31

టీ. హేభగవతి = ఓతల్లీ, పశుపతిః = శివుఁడు, సకలభువనం = ఎల్లలోకమును, తత్తత్సిద్ధిప్రసవపరతంత్రైః-తత్తత్సిద్ధి = ఆయాసిద్ధులయొక్క, ప్రసవ = ఉత్పత్తియందు, పరతన్త్రైః = పూనికగల, చతుష్షష్ట్యా = అఱువదినాలుగు, తన్త్రైః = మహామాయాశంబరాదిసిద్ధాంతములచేత, అతిసంధాయ = కప్పి (మోసపుచ్చి), స్థితః = ఊరకుండెను, పునః = మఱల, త్వన్నిర్బంధాత్-త్వత్ = నీయొక్క, నిర్బంధాత్ = బలాత్కారమువలన, అఖిలపురుషార్థైకఘటనాస్వతంత్రం-అఖిల = అన్నియు, పురుషార్థ = పురుషార్థములయొక్క, ఘటనా = కూర్చుట