పుట:Saundarya-Lahari.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

సౌందర్యలహరి

తా. తల్లీ, జరామరణములను బోఁగొట్టు నమృతమును ద్రాగియు బ్రహ్మేంద్రాదిసురులు విపత్తిని జెందుదురు. వీరలఁబోలి తానును కాలవశగుఁడు గావలసినవాఁడయ్యు శివుఁ డట్లుకాఁడు. దీనికి నీకర్ణపూరములే కారణము. కాలముయొక్క జననస్థితిలయములు తాటంకములచేతనే గలుగును గాన కాలప్రభావ మాతాటంకసన్నిధిలో నాఁగదు. అవి లేనియెడ నీశ్వరుఁడును విపన్నుఁ డగునని తా.

కిరీటం వైరిఞ్చం పరిహర పురః కైటభభిదః
కఠోరే కోటీరే స్ఖలసి జహి జమ్భారిమకుటమ్,
ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం
భవస్యాభ్యుత్థానే తవ పరిజనో క్తిర్విజయతే. 29

టీ. హేభగవతి = ఓతల్లీ, పురః = ఎదుట, వైరిఞ్చం = బ్రహ్మదేవునిదగు, కిరీటం = మకుటమును, పరిహర = తొలఁగఁజేయుము, కైటభభిదః = విష్ణువుయొక్క, కఠోరే = కఠినమగు, కోటీరే = కిరీటమందు, స్ఖలసి = జాఱెదవు, జమ్భారిమకుటం = ఇంద్రకిరీటమును, జహి = దాఁటిరమ్ము, ఇతి = ఈలాగున, ఏతేషు = ఈబ్రహ్మాదులు, ప్రణమ్రేషుసత్సు = మ్రొక్కువారగుచుండఁగా, భవనం = గృహమునుగూర్చి, ఉపయాతస్య = వచ్చిన, భవస్య = శర్వునియొక్క, ప్రసభం = తొందరగా, తవ = నీయొక్క, అభ్యుత్థానే = ఎరుర్కొనుటయందు, పరిజనోక్తిః = చెలులమాట, విజయతే = వెలయుచున్నది.

తా. తల్లీ, నీకు బ్రహ్మేంద్రాదులు మ్రొక్కుచుండఁగా నీభర్తయింటికి వచ్చుసమయమున నీవెదురేఁగుటలో నీచెలులు నీకు దారిచూపుచు అమ్మా యిదిబ్రహ్మకిరీటము చూచిరమ్ము. ఇది విష్ణువుయొక్క గఱుకుకిరీటము తాఁకునేమో చూడుము. ఇది యింద్రునికిరీటము చూడుమని తెలుపుచుందురు.

స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభితో
నిషేవే నిత్యే త్వామహమితి సదా భావయతి యః,
కిమాశ్చర్యం తస్య త్రిణయనసమృద్ధిం తృణయతో
మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజనవిధిమ్. 30