పుట:Sakalaneetisammatamu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గీ. మంత్రమాత్యపురోహితమండలికిని
దివిరి యువరాజునకునైన తేటపడఁగ
భేద మొనరింపవలయు నభేద్యవృత్తి
నట్టి దగునేని మఱి యసాధ్యంబు గలదె. 604

క. యువరాజు నమాత్యుండును
నవనీపాలున కుదంచితాయతభజముల్
ప్రవిమలనేత్రము మంత్రియు
నవు నం దొకనూనమైన నట్లగుఁ బతియున్. 605

క. మతిమంతుం డగు నరపతి
ప్రతిపక్షజ్ఞాతిభేదపరుఁ డగునది త
త్కృతమున నక్కులజుఁడు వెస
హుతవహుక్రియఁ గాన నెల్ల నుగ్రతఁ గాల్చున్. 606

మ. తగ దాజ్ఞాతిసమానుఁ డైన యతఁ డ్తర్జ్ఞానియై యుండు నే
నగు భేదార్హుఁడు గాన శత్రువులయం దాయిద్దఱన్ భేదమ
ట్లొగిఁ జేయింపఁదగుం దనం దొదవినన్ యుద్ధస్థితిన్ వారిఁ బొ
ల్పుగ శాంతాత్ములఁ జేయఁగావలయుఁ దా భూపాలుఁ డెబ్భంగులన్. 607

ఉ. శిక్షణరక్షణార్థముగఁ జేరి విభేద మొనర్పఁబోలు నా
దక్షుఁడు సౌమ్యుఁడో శకుఁడొ తా నెఱుఁగందగు సూక్ష్మబుద్ధి యై
నక్షయసౌమ్యుఁ డైనఁ దనయాడినపల్కు ఫలింప జేయు ని
ర్పక్షములం గలంచు బలుభంగులమై శకుఁ డందు లోలతన్. 608

వ. మఱియు నరనాథుం డొక్కపని యిచ్చెదనని యాసఁజూపి కాలయాపనంబుఁ జేయం దివిరి తవిలిన యభిమానియును, దాఁజేయవలవ దనినపని యితండు గావించె నని మిథ్యాదూషణంబు సేయనోపి(ర్చి)న యతండును, వివాదంబున జయంబు గొనియెద నని యతనికి జయం బిచ్చెద నని రప్పించి నిర్ణయవేళ న ట్లొనరింపకున్న నపజయంబునఁ బొందినయతండును, తగవు చెప్పుచు...బంచితతన్ను నవమానించెనని యాఘోషంబులు సేయు జనులకు