పుట:Rangun Rowdy Drama.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాంకము.

81

నన్ను పాలించువారు? ఓజగత్పతీ! నీవు దప్ప నాకు శరణ్య మింకెవ్వరుం గానరారు.

గిరి – ప్రభావతీ ! ఏమి యాలోచించుచున్నావు ?

ప్రభా - అమ్మా ! ఆలోచనకేమున్నది ! ఱోఁకటిపోటునుండి రక్షించిన తలను గానుగలో నిఱికించిన నీకరుణాస్వభావమునకై విచారంచుచున్నాను.

గిరి - ఈవేదాంతవిచారణ కేమిగాని, చూడు అతఁడు చాలా ధసశాలి, రసికుఁడు, నీతో నేమో సంభాషింపఁ గోరుచున్నాఁడు. మాకందఱ కావల పనియున్నది. పోయెదము. నీవాతని నానంద పరపుము.

ప్రభా - అమ్మా ! మంచిది. నాగతి యెట్లున్న నట్లగును. మీకు పనియున్న పోవచ్చును.

గిరి - (గంగారాంతో రహస్యముగా) కొంచెము మెత్తపడుచున్నది. ఇప్పుడే యూదరఁగొట్టిన నుపయోగింపవచ్చును. నాకు సెలవిండు. (మిగతవారితో నిష్క్రమించును.)

గంగా - (ప్రభావతిని సమీపించి) ఓసుందరీ! నేను కాకినాడపట్టణములో పేరుమ్రోగిన మారువాడీని. నన్ను గంగారాంసేట్ బహద్దర్ అంటారు. బహుశా నా పేరూ, ప్రతిష్ఠా, వినే వుంటావు. నావల్ల అనేకమంది వేశ్యలు బాగుపడి బంగారుమేడలు కట్టారు. ఇదిగో; విన్నావూ ? నాపుట్టుక, పూర్వోత్తరం, నారసికతా, నామంచీ, నాచెడ్డా, అంతా - గిరికుమారికి తెలుసును. అందుచేత ఆవిడే నీకు నావిషయంలో చాలాదూరం చెప్పేసి ఉంటుందని నన్ను నే నాట్టే పొగుడుకోవడం లేదు. విన్నావూ ! అదిగో - కళ్ళు చిట్లిస్తున్నావు. పోనీ నావిషయ మిదివఱకే విన్నావు గాఁబోలును. అందుచేత ఆట్టే చెప్పితే చిరాకుపడుతున్నట్టు