పుట:Rangun Rowdy Drama.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

రంగూన్‌రౌడీ.

న్నావు. నావిషయం చెప్పనులే! నీవిషయంచెప్పనా? నీ మొగం చూడగానే ఆకాశంనుంచి చంద్రబింబం భూమికి దిగిందేమో అనుకున్నాను. ఐతే, చంద్రబింబాని కున్నకళంకం నీ మొగంలో కనబడలేదు. అందుచేత ఆవుద్దేశ్యం రద్దుపరచుకున్నాను. విన్నావూ !- అదుగో ! మళ్ళీ చేపపిల్లల్లాంటి నీకళ్ళు చిట్లిస్తున్నావు. ఓ హెూ ! సరే ! నీదృష్టి నావ్రేలివుంగరంమీద పడుతూంది. ఇది వజ్రపు టుంగరం. నీవు మొగమోటంచేత అడగ లేకున్నా నేనే ఇస్తాను. ఇది నాలుగువేలు ఖరీదు చేస్తుంది సుమా ! ఇదిగో ! వుంగరం. వ్రేలికిపెట్టనా? అదుగో! మొగము చిట్లించావు. పోనీ, నీవే వ్రేలికి పెట్టుకో ! (ఉంగరమిచ్చును.)

ప్రభా - (స్వగ) ఆహా ! ఏమి నాఅదృష్టము ! పరమేశ్వరుఁ డెంత కృపామయుఁడు ! మనసార నమ్మినవారి నన్యాయము చేయఁడు గదా ! ఈమూడుఁడు నాహృదయమును గ్రహింపలేక , నన్ను ప్రసన్నురాలినిగాఁ జేసికొనఁదలంచి, వజ్రాంగుళీయక మిచ్చినాఁడు. ఈయంగుళీయకమునందలి వజ్రమే నాసర్వకష్టములకు శాంతిని ప్రసాదించుఁగాక !

గీ. ఎఱిగి యెఱుఁగక చేసిన దురితములను
    సర్వమును క్షమియించి నీ సన్నిధాన
    మందుఁ జేర్చుకొనుము దైవమా ! త్వదీయ
    దాసురాలికష్టముల నంతంబుజేసి.

(ఉంగరమును నోట నిడుకొని నమలును.)

గంగా -- (దిగ్భ్రాంతుఁడై) ఆ ! ఆ ! ప్రభావతీ ! ప్రభావతీ !! ఎంత దారుణము చేసితివి ! ఎతదారుణము చేసితివి!

ప్రభా - (భూమిపైఁబడి) సేట్‌జీ ! విచారింపకుఁడు ! మీకిదే నమస్కారము. ఈ భూమిపై నాకెవ్వరును గావింపలేనిమహోపకార