పుట:Rangun Rowdy Drama.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాంకము.

55

అన్న – నాధా! అన్యాయముగా, నన్నేటికి మభ్యపరచి మోసగింపఁజూచెదరు? ఎవ్వరో పెద్దమనుష్యుని మోసగించి ఆయనభార్యతోఁ గలిసి, వేగుజాముననే కలకత్తా స్టీమరుపైఁ బ్రయాణనిర్ణయ మొనర్చు కొనుటను నేను వినలేదనుకొంటిరా? మరల సిట్టిమోసకృత్యము లొనర్చుచు కలుషజీవనమార్గముననే ప్రవర్తిల్లెదరా? ఇట్టి కార్యములు మసకు నిక్క ముగఁ బ్రమాద జనకములు. నాథా ! నాధా ! ఈదాసురాలిప్రార్థనంబుఁ ద్రోసివేయకుఁడు.

(అనుబంధము-18.)

శంక – (స్వగ) ఛీ ! ఇది యెక్కడిపీడ దాపురమయ్యె నాకు ? ఐనను తొందరపడఁదగినసమయము కాదు. దీనికి ధనాశఁజూపి యావల కంపివేయుట క్షేమమార్గము. (ప్రకా) అన్నపూర్ణా ! ఇప్పుడు నీవేమియు నల్లరిచేయకుము. రేపటిదినమే కాకినాడకు జను నోఁడయొకటి కలదు. దానిపైన నీవు క్షేమముగా స్వదేశముం జేరుకొనుము. ఈరూపాయలను ఖర్చులకొఱకైదగ్గఱ నుంచుకొనుము. నేనును త్వరలో వచ్చి కలిసికొందును. (ఇచ్చును.)

అన్న - నాధా ! ఎంత భ్రాంతు లగుచుంటిరి ? ధనముచే తృప్తినంది మి మ్మీపాపకూపమ్మున వదలిపోవుటకు నేను నెలకాంత నని తలఁచితిరా ! అగ్నిసన్నిధానమున మీరు నన్ను వివాహమాడితిరి. సదా మీఛాయవలె మి మ్మనుసరించి యుండవలసిన దాననేగాని, నా కీధన మెందులకు ? భారతనర్ష మున జనించిన పతివ్రతలకు ధవుఁడేగాని ధనము ప్రధానము గాదని విశ్వసింపుఁడు. నే నిట్టిధనము నెంతమాత్రమును లక్ష్యపెట్టుదానను కాను. (నోటును చింపి పారవైచి) మీసన్నిధానభాగ్యమునకై నే నిచ్చటికి వచ్చితిని. ఇంక విడువను. నన్నుగూడ మీవెంటఁ గొనిపొండు.