పుట:Rangun Rowdy Drama.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

రంగూన్‌రౌడీ.

శంక — (కోపముతో) ఓసీ ! నిర్భాగ్యురాలా ! ఎంతపని చేసితివి ! వేయి రూపాయలను పాడుచేసితివిగదా ? ఛీ ! ఇంక నీకు సద్గతిలేదు. అధఃపతనమే గతి. నే నింక నీమొగము చూడను. నీవేమైననుసరియే.

(పోఁబోవును.)

అన్న — (అడ్డమువచ్చి పాదములమీఁదఁ బడి) నాధా ! నాధా! న న్నొంటరిగ విడచిపోవుట మీకు న్యాయముగాదు ! న్యాయముగాదు.

(అనుబంధము-19.)

శంక -- (అన్నపూర్ణచేతిపై పొడుచును)

మోహ -- ( ప్ర ) అమ్మా ! అమ్మా ! (ఏడ్చును.)

తెరలో - కౌన్ హై! పకడో ! పకడో !

శంక - (పారిపోవును)

రమే - (భటులతో ప్రవేశించును.)

రమే - (అన్నపూర్ణ చేతికి కట్టు కట్టుచుండును.)

( తెరవ్రాలును.)

రంగము. 2.

స్థలము:- -గంగారామునియిల్లు.

[నాందీబాయి కుమారునితో ప్రవేశము.]

నాందీ -

(అనుబంధము- 20)

నాబిడ్డకూ, లోకంలోవున్న తక్కిన అందఱిబిడ్డలకూ, కొంచెము తేడా వున్నమాట నిజమే. అదేమిటంటే, లోకంలో బిడ్డ లందఱికీ తండ్రి ముందుగానే యేర్పాటై వుంటాడు. ఇఁక నాబిడ్డడికి పుట్టిన తరువాతగాని తండ్రిని సిసలుచేయడానికి వీలులేదు. మా అబ్బాయికి, నీవుతండ్రివిగాఉంటే బాగుంటుందని, యెవరినైనా అడగడం మంచిదేనా ! నాకేమీతోచకుండా వుంది. అయినా అడిగిచూస్తాను; ఇందులో తప్పేముంది?