పుట:Rangun Rowdy Drama.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాంకము.

39

శంక - ప్రభా - (నిష్క్రమింతురు)

రమే - నౌఖర్ ! ఉన్కూ అందర్ ఆనే దో !

సేవ - జో హుకుం (సలాం చేసి నిష్క్రమించును.)

(భటసమేతముగా తులసీరావు ప్రవేశము.)

తుల - రమేశమహాశయా! సలాం ఆ లేఖుం.

రమే - ఆలేఖుం సలాం. బైఠియే ! తులసీరావుజీ !

తుల - (కూర్చుండి) జనాబ్ ! సావకాశముగ గూర్చుండుట కిది నాకు సమయము గాదని విన్నవించు కొనుచున్నందులకు క్షమింతురని నమ్మెదను. నే నొక కార్యభారమును పైనిడికొని తమదర్శనమునకు వచ్చితిని.

రమే - మంచిది. మీ రేకార్య భారమునవచ్చితిరో తెలియఁజేసెదరా ?

తుల - ఈనడుమ కాకినాడలో రంగారా వనుపేరుగలవృద్ధుని ఖూనీచేసి యీరంగూన్ పురమునకు పరారీ యయివచ్చినశంకరరావు అనువానిచరిత్రమును మీరు వార్తాపత్రికలమూలముననైననను వినియుందురు.

రమే - ఆ ! వినియుంటి ననుకొందును. ఆవిషయమున నావలన నేదైన సహాయము నపేక్షించి వచ్చితిరా ?

తుల - క్షమింపవలయును. ఏదైనసహాయముకొఱకు నేను వచ్చియుండలేదు. చక్రవర్తిపేరుమీద హంతకుని నా కప్పగింతురనియే నమ్మి వచ్చితిని.

రమే - మీయభిప్రాయము నాకు తెలియలేదు. మీవెంట నేను భటుని వలె తిరిగి హంతకుని పట్టుకొనవలయు నని మీయభిప్రాయమా?

తుల - అంతటిమాటను లక్షాధికారులగు తమ్ము నే ననఁగలనా ?

రమే - అంతకన్న మీయభిప్రాయ మేమి ? తుల