పుట:Rangun Rowdy Drama.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

రంగూన్‌రౌడీ.

తుల - నాయందు తప్పుగలదేని క్షమింపుడు. కాని, సర్కారుహుకుము నాకడ నున్నందున, సజ్జనులైన తమ్ము నొప్పింపవలసివచ్చు చున్నది.

రమే - నీదొంగతనములను గట్టిపెట్టు. నీప్రవర్తన సందేహాస్పదముగ నున్నది.

తుల - అయ్యా! నన్ను సందేహించెదవా? నీయందే నేను సందేహముఁ బూనవలసియున్నది.

రమే - ఎందులకై ?

తుల - హంతకుని నీయింట దాచినందులకై.

రమే - ఓ మర్యాదహీనుఁడా ! ఎవరితోమాటలాడుచుంటివో యెఱింగి యుంటివా ?

తుల - ఆహా ! సంపూర్ణముగా నెఱుఁగుదును.

రమే - నేను గొప్పపలుకుబడికలుగు లక్షాధికారిని సుమా !

తుల - హంతకుని దాఁచినయపరాధివికూడను.

రమే - బస్ ! బస్, ఇఁకచాలు. మాటలాడక నాయిల్లు కదలు.

తుల - హంతకునిఁబట్టి యిమ్ము. కదలెదను.

రమే - నాయింట లేఁడు.

తుల - లేఁడా నీయింట ?

రమే - లేఁడు.

తుల - అమర్యాదపాలు గాకు. సోదాచేయవలసి వచ్చును.

రమే - సాహస మున్న సోదా చేసికొనుము.

తుల - భటులారా! ఈయిల్లు సోదాచేయుఁడు.

భటు — (వెదుకఁబోవుదురు.)

రమే - హఠ్ జావ్!

(మెల్లగా తెరవ్రాలును.)