పుట:Rangun Rowdy Drama.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

రంగూన్‌రౌడీ.

    పతిభిక్ష నిమ్మంచు పదములఁబడి వేడు
              తనయను కడకాలఁ దన్నివేసి
    పాపంపు పోలీసు పదవి చేజిక్కిన
              కూళవై పుత్రిక గొంతుగోసి
    తనయ శోకింప నల్లునిఁ బట్టి యురికంబ
              మున నిల్పి రక్తము కనులఁ జూచి

    ధనము నధికారమును బిరుదములె ఘనము
    గాఁగ నెంచుచు, శాశ్వతకల్పకముగ
    నీవు నీయధికారు లీనిఖిలజగతి
    మూటగట్టుక చత్తురే ! మూఢహృదయ !

తుల - చాలింపు మింక నీయార్భాటము ! నీవు బిడ్డవుకావు. నేను తండ్రినిగాను. ఆహంతకుని చూపెదవా? లేదా ?

అన్న -- హంతకుఁడేమో ! నీవేమో ! నే నెఱుఁగను.

తుల - ఓసీ ! ఎఱుఁగవా హంతకుని ?

అన్న - ఎఱుఁగను. ఇంక నన్నింతకన్న నేమిచేసేదవో చేసికొనుము.

తుల - ఆద్వారమునువదలి నాకుదారినిమ్మ ఇల్లు సోదా చేయవలెను.

అన్న – గుమ్మమును వదలను,

తుల - వదలవా?

అన్న - వదలను.

తుల - వదలించెదనుసుమీ!

అన్న - ఆఁడుబిడ్డపై చేయిచేసికొనఁగల్గినచో చేసికొనుము; నేనువదలను.

తుల - అధికారము నాకడనుండ ఆఁడుదియేమి ? మగవాఁడేమి?

(బలవంతముగ త్రోసి లోని కరుగును.)

అన్న — (రెండవద్వారమున శంకరరావును బయటకుఁ దెచ్చి) స్వామీ! ఇంక మీరు పారిపొండు ! నాతండ్రి చూచిన నిప్పుడే బంధింపఁ ఆఁడుబిడ్డపై