పుట:Rangun Rowdy Drama.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[3]

ద్వితీయాంకము.

31

గలఁడు. భగవత్కృపయున్న నెన్నఁటికో పునర్దర్శనము. లేదేని యిదే కడచూపు. మీపాదములకు నమస్కారము.

శం - (పారిపోవును.)

తుల - (బయటకు వచ్చి) గంగారాం! ఆహంతకుఁడు పరారియైనాడు. ఈయింట కనఁబడలేదు. రమ్ము. వెంటనంటుదము.

తుల - గంగా - (ఇద్దఱును నిష్క్రమింతురు.)

అన్న - (చేతులు జోడించి) భగవానుఁడా ! నాప్రాణేశ్వరుని ప్రాణ రక్షణమున కిఁక నీకన్న దిక్కెవ్వరును లేరు. రక్షింపుము.

(అనుబంధము 13.)

(నిష్క్రమించును.)

(తెర బ్రద్దలై ఓఁడ కాన్పించును. శంకరరావు ఓఁడలోని గాలిగొట్టముచాటున దాగియుండును. తులసీరావు సముద్రతీరమునకు పోలీసులతో వచ్చును. శంకరరావు సముద్రమున దూకును. ఓఁడ నడచి పోవును. తులసీరాయాదులు నిష్క్రమింతురు. ఒక తిమింగలము యీఁదుచున్న శంకరరావువెంటఁ బడును. ఇంతలో షికారుచేయుచు వచ్చిన రమేశబాబును, ప్రభావతియు, నావపై కాన్పింతురు. ప్రభావతి పిష్టలుతో తిమింగిలమును చంపును. రమేశబాబు వలవేసి శంకరరావును నావలోనికి చేర్చి రక్షించును.)

(తెర- మెల్లఁగా వ్రాలును.)

ద్వితీయాంకము.


___________