పుట:Rangun Rowdy Drama.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రంగూన్ రౌడీ

అను

పతిభక్తి.

తృతీయాంకము.

రంగము - 1.

స్థలము:— రంగూనులో రమేశబాబుమందిరము.

[ప్రభావతి హార్మోనియం వాయించుచు, పాడుచుండును.]

శంక -- (ప్రవేశించి) ప్రభావతీదేవీ ! ఇనుమువలె, కఠినమైన నాహృదయమునుసయితము మనోమోహనమైన మీసంగీతము సూదంటురాయివలె యీడ్చుకొని వచ్చినది.

ప్రభా - (లేచి మేలిముసుఁగు సవరించుకొని) శంకరరావుబాబూ ! ఈయాసనముపైఁ గూర్చుండుఁడు. రంగూన్ పట్టణమును మీరిదివఱ కెన్నఁడును. చూడలేదు కాఁబోలును. ఎట్లున్నది ?

శంక - ఏమని చెప్పుదును ! ఇది దేవేంద్రుని యమరావతీపురముతో సమానమైనదనియు, నిచ్చట నైరావత మను తెల్లయేనుఁగు సయితము కలదనియు, నిచ్చటి స్త్రీలు వృద్ధాప్యము నెఱుంగక దేవతాస్త్రీలం బోలియుందురనియు కథలుగా చెప్పుకొనుట వింటినే కాని, కన్నులఁ జూచియెఱుఁగను. నీ కృపారసమున నీ పురసందర్శనభాగ్యముం గంటిని.

సీ. అత్యగాధము దీర్ఘమైన యైరావతి
                  స్వచ్ఛోదకంబు లొసంగుచుండ,