పుట:Rangun Rowdy Drama.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాంకము.

29

అన్న -- అంతేగాని, అనుగ్రహింపవా ?

తుల - అనుగ్రహ మీజన్మమున లేదు.

అన్న - ఆశ వదలుకొనవలసినదేనా ?

తుల - నిస్సందేహముగ.

అన్న - హా ! విధీ !

గంగా – మహరాజ్ ! నీకుమార్తె - నీయల్లుఁడు-

తుల - ముసలిపీనుగా ! నోరు మూసెదవా ! మూయింపవలెనా !

గంగా - జో హుకుం. (నోరుమూసికొనును)

అన్న — (కోపముతో లేచి) ఓపాషండుఁడా ! బంధువాత్సల్యహీనుఁడా! నీవు గొడ్డుఁబోతువైన నేల కావైతివి ? కన్నబిడ్డ కడకాళ్ళంటి వేడుచుండఁగా కాఠిన్యమును బూనిననీది హృదయమా ? పాషాణమా? ఒకయబల - అందును కడుపునఁ బుట్టినబిడ్డ - శోకార్తయైన సుత -భర్తృప్రాణరక్షణమునకై ప్రాకులాడుచున్న పడఁతిమాంగల్యమును నిలిపి ఒకదీనునిరక్షించుమహా కార్యము కొఱకై, దయాదాక్షిణ్యముల నెఱుఁగని నీయుద్యోగమును వదలుకొనలేవా ? ఆర్జించిన ధనపుసంచులు చాలవా? సంపాదించిన బిరుదములతో సంతృప్తి గలుగలేదా ? అల్లునిప్రాణములు తీసి అధికారుల మన్ననల నందుదువు; ఇంతేకదానీప్రతాపము ! ఇదియేగదా నీయుద్యోగధర్మము ? మాసంసారమును మారణముచేసి తండివైననీ వింకొకబిరుదును సంపాదించుకొనుట ఘనమనియే యనుకొనుచున్నా వా ? ఈయుద్యోగమున నీవు మాత్రము తుద కేమి బ్రాముకొనఁగలవు! ఛీ! కలుషాత్ముఁడా ! కఠినహృదయా !

సీ. ప్రాణభీతార్తుఁడై పారిపోవఁగనున్న
               యల్లుని నధికార్ల కప్పగించి