పుట:Rangun Rowdy Drama.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

రంగూన్‌రౌడీ.

నాంది - మఱినీవు దాసివికావూ?

దాసి - నో! నో! అయామ్ దీ సర్వెంట్ ఆఫ్ సేట్ సాహేబ్ . అనఁగా నేను సేటుసాహేబుగారి సర్వెంటును.

నాంది - అబ్బో ! సీమకుక్కవలె తయారైనావు. చిల్లరపనులుచేయవు కాఁబోలును! మఱినీవు చేసేపను లేమిటీ ?

దాసి - హమేషా సేట్ సాహేబుగారిదగ్గర హాజరుగా ఉండడం. ఆయనకు డ్రెస్ కావాలిస్తే అందివ్వడం. పండుకొన్నప్పుడు పంకా విసరడం - ప్రక్క. వేయడం.

నాంది – (ఈర్ష్యతో) ప్రక్క వేసి పండుకోవడం.

దాసి - చెడుమాటలాడకు; చెంపదెబ్బలు తింటావు.

నాంది - ముండా ! నాయింట్లో ఇందుకే చేరావంటే !

దాసి - రండా ! నన్ను తిడతావంటే - (అనుబంధము-9.)

[ఇద్దఱును కొట్టుకొనుచుండగా గంగారాంసేటు ప్రవేశించును. ఇద్దఱును కలిసి అతనినిగూడ కొట్టుదురు.]

గుగా - శాంతించండి ! శాంతించండి ! గంగాగౌరీసంవాదము.

నాంది - ఈ రాక్షసినిఁ దెచ్చి నానెత్తిమీఁది కెక్కించి, తిట్టించవలెననుకొన్నావా ?

దాసి - ఈగయ్యాళిదగ్గర తిట్లుపడమని నన్ను తెచ్చావా ?

గంగా - మీరు తిట్టుకోవద్దు- కొట్టుకోవద్దు- మాట్లడుకోనే వద్దు -సర్వెంట్! నీవు లోపలికి వెళ్ళు.

(దాసి, నాందీబాయి మెటికలువిఱుచుకొందురు. దాసినిష్క్రమించును.)

(తెరలో) సేట్ సా హేబ్ ! ఒకదర్వాన్ మీదర్శనానికి వచ్చాడు.

గంగా - అచ్ఛా ! అచ్ఛా ! రమ్మను.

జయ — [1](దర్వాన్ వేషముతో ప్రవేశము.)

  1. దర్వాన్ -హిందూస్థానీ ద్వారరక్షకుఁడు.