పుట:Rangun Rowdy Drama.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాంకము.

23

గంగా - బేటా ! తూ కౌన్ ?

జయ - మై హుం ఫయల్ వాన్ !

గంగా - తూ మేరా ఘర్కూ ఆయా క్యా వాస్తే ?

జయ — నౌకరీకా వాస్తే

గంగా - నాందీ ! మనకు దర్వాన్ అవసరమా ఇప్పుడు ?

రాధా -- (ప్రవేశించి) ఆహా ! అవసరమే ! తప్పకుండా ఇప్పుడు మన కొకదర్వాన్ అవసరము. ముఖ్యావసరము కూడాను.

గంగా - అచ్ఛా, 'బేటీ ! అచ్ఛా. దర్వాన్జీ! తుమారా నాం క్యా హై?

జయ - హర్వాన్ సింగ్గం

గా -- అచ్ఛా ! తుమారా బాప్కా నామ్ ?

జయ - బహుదూర్ సింగ్--

గంగా - తుమారా బాప్కా బాహ్కనామ్ ?

జయ - నారాయణసింగ్

గంగా - ఉస్కా బాప్కానామ్ ?

జయ - కల్యాణ్ సింగ్ --

నాంది - (నడుమకువచ్చి ఒయ్యారముగా) తుమారా సస్సూర్ కానాష్ ?

జయ - గంగారామ్!

గంగా -- (స్వగతం) ఏక్యా ? మేరానామ్. (ప్రకాశం) అచ్ఛా అచ్ఛా! దర్వాన్ భాయ్! తుమ్కూ తెలంగీ బాత్ మాలుం హై ?

జయ - జీ ! హాఁ!

గంగా - ఐతేహర్వాన్ సింగ్ ! నీవు మాయింట్లో నౌఖరీకి తగినవాఁడవే! జీతంమాట మనం ప్రత్యేకంగా మాట్లాడుకొందాం! నీకు హమేషా మాఅమ్మాయి రాధాబాయిదగ్గర కాపలాఉండే ఉద్యోగము. తెలిసినదా ! ఎందుకో ఎఱుఁగుదువా ! ఆఁ ఊఁ- సరే ! నీ కీఉద్యోగ మిష్టమేనా