పుట:Rangun Rowdy Drama.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుబంధము

109

(19) డైలాగు.

బ్యాండు - ఆది.

శంక - పలుకులు పెడచెవి నిడెదవుగా ! పలుమరు నను విడదలపవుగా॥
         ముదమేపారన్ | విలసిల్లెడి నన్ అపకీర్తికి పా | లొనరించెదుగా!!
అన్న - విడువనింక ధీరగుణా | అఅఅఅ మనగజాలా | మానధనా |
         అఅఅ
శంక -- ......!!పలుకులు!!

(20) నాందీబాయి.

అయ్యో అయ్యో | ఈ బాలకునకు | అయ్య యెవఁడొకో |
నెయ్యమున నేవ్వారినైన | నేర్పరింతునా ||అ!!

(21) శంకరరావు.

బ్యాగ్ - ఆది.

హాయీ! గలిగించును యీసారాయీ | రుచిచూడుము
భాయీ !!హా||
మదిగల కలఁతల నిమిషములోపల | మరపింపఁగదగు హుషారి
నొసగుచు | మది బ్రహ్మానందము చేకూర్పగ | గలదిగా | నిమి
షమా | త్రంబుననె !!హా!!

(22) శంకరరావు.

(కసియాత్యజింపదాలా అను మట్టును పల్లవిమాత్ర మనుకరించును.)

ధనమే ప్రపంచలీలా | ఆహా !ధన||
బలే | దానిమహిమ వర్ణింపజాలా || ధన!!
(సాకె) ధనహీనుం డవనిలో
(మిత్రం) తృణసమానమగు నేచాలా ! తృణసమాన మగునే! ధన!