పుట:Rangun Rowdy Drama.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాంకము.

99

నాయధికారధర్మమునుగాదు. నాతీర్మానమును విన్నవించు చున్నాను. ఆలకింపుము

"హిందూదేశశిక్షాస్మృతి ననుసరించి - గిరికుమారియింట జరిగిన హత్యలను రెంటిని నీవే యొనరించినట్లు స్వయముగా సమ్మతించుచున్నావు. కావున, వేఱు సాక్ష్యములతో నిమిత్తము లేకుండ యిందుమూలముగానీకు ఉరిశిక్షను విధించుచున్నాను.”

అన్న - మహాప్రసాదము-

జడ్జి – (పీఠమునుండి లేచును.)

( తెరవ్రాలును.)

రంగము-5.

స్థలము:— వధ్యశిలగల బయలు.

[ప్రవేశము — వధ్యశిలపై అన్నపూర్ణ - ప్రక్కన ఖడ్గహస్తుఁడగు కటికవాడు, పీఠముకడ జైలుసూపరింటెండెంటు.]

(గంట మ్రోగును.)

జైలు - అమ్మా అన్నపూర్ణా ! ఐదునిమిషములు దైవప్రార్థనముచేసి కొనుటకు నీ కధికారముగలదు - శీఘ్రముగ కానిమ్ము.

అన్న - (కన్నులుమూసి) జగదీశ్వరా !

సీ. జీవితేశునకయి జీవప్రదానంబు
                గావింపగా మది గాంక్షఁజేసి,
    విభుఁడొనరించిన విద్రోహములనెల్ల
                చలనంబులేక నౌదల ధరించి,
    హంతకినని పల్కి యధికారవర్గంబు
                నదలించి యురికంబమందుఁ జేరి,