పుట:Rangun Rowdy Drama.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

రంగూన్‌రౌడీ.

     పావనంబగు భగవద్గీతపైన వి
                  శ్వాసార్హమైనట్టి ప్రతిజ్ఞ జేసి,

     పెనఁగులాడితి స్వామి నావిభునికొఱకు.
     అఖిలదోషముల్ మన్నించి యన్నపూర్ణ
     భావిజన్మంబులందున ప్రాణనాథుఁ
     గాగ శంకరుఁ గూర్పుమోకలుషహరణ !

అయ్యా ! నా ప్రార్థనము పూర్తియైనది. ఇంక మీకర్తవ్యమును నడుపుఁడు.

జైలు - కిరాతుఁడా! నీ పని కానిమ్ము.

కిరా - (కత్తి నెత్తును.)

[శంకరరావు పటాక్షేపమున ప్రవేశము.]

శంక -- నిలుపుము - కిరాతుఁడా ! ఆఖడ్గమును నిలుపుము -

అన్నపూర్ణా! అన్నపూర్ణా! నీవు నిర్దోషివి. ని న్నీస్థితికిఁ దెచ్చిన పాపాత్ముఁడను నేను. నే నుండగా నీవేల వధింపఁబడవలెను ? లెమ్ము, చేసిన సర్వవిద్రోహములకును ఉరిశిక్ష ననుభవింప నేను వచ్చితిని. నామనవి వినుము. పవిత్రురాలవగు నీ కాపాపప్రదేశము తగినదికాదు. నేను జడ్జిగారికి వ్రాసికొంటిని. నీవధను నిలుపుటకై ఆజ్ఞాపత్రము రాగలదు. రమ్ము - క్రిందికి రమ్ము,

అన్న - నీపాప మేమో నీ వేమో నే నెఱుఁగను. గిరికుమారియింట నేను రెండుహత్యల నొనరించినహంతకి నగుటవలన శిక్షింపఁ బడుచున్నాను. అయ్యా ! మీరేల విభ్రాంతులై యింకను చూచుచున్నారు ? మీ రీయున్మత్తునిమాటలను విశ్వసించుచున్నారా ? రాజద్రోహ మొనర్చుట మీకు తగదు. నన్ను వధింప నాజ్ఞయిండు.