పుట:Rangun Rowdy Drama.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

రంగూన్‌రౌడీ.

శంకరరావుసుమా! మామను చంపినహంతకుఁడు-మామ నొక్కనినేనా? అసంఖ్యాకులైన రక్షకభటులను హతమార్చినవాఁ డీశంకరరావే ! మీరందఱు తెలివితక్కువ పందలై, నిరపరాధిని, భర్తృగౌరవప్రాణసంరక్షణి యగు పతివ్రతాశిరోమణిని బంధించి, హత్యాపరాధమునుమోపి, వధ్యశిలపై నెక్కించి, వధింపఁ దలఁచినారు. (క్రోధముతో) ఓరోరిదుర్మార్గులారా' న్యాయాన్యాయవిమర్శక పరిజ్ఞాన విహీనులారా ! నాయర్ధాంగి నంటుటకు మీతరమగునటరా ! "రంగూన్‌రౌడీ” అను విఖ్యాతినొందిన రాజుభటభయంకరుఁడగు నీశంకరరావు ప్రాణములతోనుండగా నిరపరాధినియగు నన్నపూర్ణను శిక్షింప మీతర మగునా ! మిమ్ముసృష్టించిన బ్రహ్మతరమగునా! ఇంక శంకరరావు ప్రతాపమును చూడుఁడు, మిమ్మందఱను మారణహోమము చేయనున్నాఁడు. (వెఱ్ఱివానివలె పరుగెత్తును.)

( తెరవ్రాలును.)

రంగము 4.

స్థలము - న్యాయస్థానము.

[ప్రవేశము - జడ్జి, అన్నపూర్ణ, రైటరు, ఇద్దరున్యాయవాదులు, ఒకపోలీసు.]

జడ్జి - అమ్మా ! అన్నపూర్ణా ! నిన్ను నే నెన్నఁడును చూడకున్నను, నీపవిత్రచరిత్రమును నే ననేకసారులు వినియుంటిని. ఏమి యింత సాహసమునకు పాల్పడితివి ?

అన్న - తండ్రీ ! మీరు న్యాయాధికారులు ! ఇప్పుడు న్యాయశాస్త్ర ప్రకారముగా, నా కర్హమగుశిక్షను దయచేయుఁడు. అంతే కాని యితరవిషయములను నన్ను ప్రశ్నింపకుఁడు.

జడ్జి - మంచిది. నీచరిత్రమును విమర్శించుటకుగాని, నీకు హితాహిత బోధలను గావించుటకుఁగాని నా కిది సమయముగాదు. అది