పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెళ్ళిన రాజశేఖరుఁడుగారు బరుండుగదిలోఁ బ్రవేశింతుము. గదిలో ను త్తరపు గోడ పొడుగునను దూర్పునుండి పడమటకు పందిరిపట్టె మంచము రాతి దిమ్మలమీఁద నాలుగు గాళ్ళను మోపి వేయఁబడి యున్నది. మంచమునకు చుట్టును దోమతెరయును జాలరును దిగవేయబడియున్నది. పందిరి స్తంభములకు నడుమను లక్క పూసిన కొయ్య పళ్ళెములను బరిణెలు నుండెను. పందిరికి మధ్యగా లక్కకాయలను, పువ్వులను గల చిలుకల పందిరి యొక్కటి వేలాడు చుండును. గోడలకు సుద్దతో వెల్ల వేయఁబడి యుండెను. గోడల పొడుగునను రుక్మిణియు, తల్లియు నోపికచేసి కట్టిన గోడసంచులు తగిలించబడి యుండెను. ఆ గోడ సంచులకు కొంచెము మీఁదుగ గుడ్డ చిలుకలు దారములతో త్రాళ్ళకు కట్టబడి గాలికి సుందరముగా కదలుచుండును. గోడకు పెద్ద మేకులు కొట్టి వానిమీఁదఁ బెట్టిన బల్ల మీఁద కొండపల్లి బొమ్మలును, లక్కపిడతలను గది కలంకార భూతముగా నుండెను. గోడనంచులు కొట్టిన మేకులకు దశావతార ములు మొదలయిన పటములు చిన్నవి వేయబడి యున్నవి. దక్షిణపు గోడకు శ్రీరాములవారి పట్టాభిషేకము తగిలింపఁబడి యున్నది. దానినే రాజశేఖరుఁడుగారు నిద్ర లేచిన తోడనే చూచి, ఆవల మఱి యొక వస్తువును జూతురు. గదికిఁ బయిని అందమయిన బల్లకూర్పు కూర్పఁబడి యుండెను. మంచమున కెదురుగా దక్షిణపుగోడ పొడుగునను గడమంచెమీఁద వరుసగా కావడి పెట్టెలు పెట్టఁబడి యున్నవి. ఆ పెట్టెలలో సాధారణముగా ధరించుకొను వస్త్రము లను నాగరలిపితో బంగాళా కాగితములమీద వ్రాయఁబడిన రాజ శేఖరుఁడుగారి సంస్కృత పుస్తకములును వేయఁబడి యుండెను. గదిలో పడమటిగోడతట్టున పెద్ద మందస మొకటి గట్టితాళము వేయఁ బడి యుండెను. ఆ మందసములోపలనున్న చిన్నతాళపు పెట్టెలలో నగలును పండుగ దినములలో ధరించుకొను విలువ బట్టలను రొక్కమును ఉండును. చీఁకటి రాత్రులలో దొంగల భయము విశేషముగా నుండునప్పుడు రాజశేఖరుఁడుగారు ఆ మందసముమీఁదనే పఱుపు

42