పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రము చేయుచున్నట్టును నున్న శివ సంబంధము లయిన పటములను, , విఘ్నేశ్వరుఁడు, సరస్వతి, గజలక్ష్మీ, చతుర్ముఖుఁడు మొదలుగాగల మఱికొన్ని పటములును గోడల నలంకరించు చుండును. ఉత్తరపు ప్రక్క చావడియు ఈ విధముగానే యుండును గాని, గోడ కొక్క గుమ్మము మాత్రమే యుండి అది తరుచుగా మూయబడి యుండును. ఈచావడిలో రెండుమూడు పాతసవారీ లెప్పుడును వేలాడఁ గట్టబడి యుండును. రాజశేఖరుఁడుగా రప్పుడప్పుడు గ్రామాంతరములకుఁ బోవునప్పుడును పెద్దమనుష్యు లెవ్వరయినఁ దఱుచుగా నెరువడుగునపడును ఉపయోగపడుచుండు క్రొత్త సవారి మాత్రము బురకా వేయఁబడి చావడిలో క్రిందనే పడమటిగోడ దగ్గరఱఁ జేర్పబడి యుండును. ఈ చావడి గోడకున్న తలుపు తీపి యుత్తరపు పంచపాళిలోనికి పోయినతోడనే దొడ్డిలో నుయ్యి యొకటి కనఁబడును. ఆ నూతిపయినుండు గిలకలు కీచుధ్వని చేయు చుండ నిరుగుపొరుగులవారు సదా నీళ్ళు తోడుకొని పోవుచుందురు. ఆ నూతికి పడమటివైపున ధాన్యము నిలవచేయు గాదెలు రెండు లోగిలిని చేరక ప్రత్యేకముగా గట్టింపఁబడి యున్నవి. నూతికి సమీప ముగా వీధిలోనికి పాణి ద్వార మొకటి యున్నది. ఇంతకు మునుపు రుక్మిణి వచ్చిన దాద్వారముననే ఆ దారినే యిరుగుపొరుగువారు వచ్చి నీళ్ళు తోడుకొని పోవుచుందురు. మఱియు మధ్యాహ్న సమయమున చుట్టుప్రక్కల నుండు స్త్రీలు వారిని చూడవచ్చునప్పడును, రాజ శేఖరుఁడుగారు కచేరిచావడిలోఁ గూర్చున్న కాలమున లోపలి యాఁడువారు వెలుపలికి వెళ్ళవలసినప్పడును, ఆ త్రోవనే వచ్చుచుఁ బోవుచుందురు.

లోపలి కుండునకు నాలుగు ప్రక్కలను పనసకాయలు చెక్కిన నాలుగు స్తంభము లున్నవి. వీధిచావడి కెదురుగా నుండు పడమటి చావడిలో లోపలికిపోవు నడిమిగుమ్మ మొకటి యున్నది, ఆ గుమ్మమున లోపలికిఁ బోవగానే చావడి యొకటి కనిపించును. ఆ చావడికి దక్షిణపువైపున గుమ్మమొకటి యున్నది. ఆ ద్వారమున లోపలికి

41