పుట:Puneetha Paul bodhalu 2.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తనాన్నిబట్టే మనలను తన ప్రజగా ఎన్నుకొన్నాడు. ఎన్నుకొని మనలను తన సేవకు పిల్చాడు. పిల్చి క్రీస్తుద్వారా మనకు నీతిని అనగా రక్షణను దయచేసాడు. దీని ఫలితంగా మనకు మహిమను దయచేసాడు. ఈ మహిమ ఉత్థానం, మోక్షభాగ్యంకూడ.

8. క్రైస్తవుల జీవిత విధానం 13

క్రైస్తవులు ప్రపంచంలో ఏలా జీవించాలి అనడానికి పౌలు కొన్ని సూత్రాలు చెప్పాడు. ఇక్కడ మూడంశాలు వున్నాయి.

1. పౌరులుగా క్రైస్తవుల బాధ్యతలు 18,1-7

పౌరులుగా క్రైస్తవులు ప్రభుత్వాధికారులకు లొంగాలి. ఎందుకు? పౌలు మూడు కారణాలు చెప్పాడు. 1. అధికారం దేవుని నుండే వస్తుంది కనుక అందరూ దానికి లొంగవలసిందే 1-2

2. అధికారులు దుపుల్ని శిక్షించి సజ్జనుల్ని రక్షిస్తారు. కనుక మన అంతరాత్మ వారికి లొంగమని చెప్తుంది 3-5.

3. అధికారులు సమష్టి శ్రేయస్సు కొరకు కృషిచేస్తారు. అందరి మేలు లెక్కలోకి తీసికొంటారు. కనుక మనం వారికి పన్నులు చెల్లించాలి.

పౌలు ఈ జాబు వ్రాసేటప్పటికి రోమను ప్రభుత్వం ఇంకా క్రైస్తవులను హింసించ లేదు. తర్వాత వేద హింసలు ప్రారంభమయ్యాయి. పౌలు ఇక్కడ ప్రజలు ప్రభుత్వానికి అనుకూలంగా మెలగాలని చెప్పాడు. కాని అతడు చెప్పిన సూత్రాలు అన్ని కాలాలకూ, అన్ని ప్రభుత్వాలకు వర్తించవు.

2. సోదరప్రేమ ముఖ్యం 18,8-10

ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞాలున్నాయి కాని అవన్నీ సోదరప్రేమ ఆజ్ఞలో ఇమిడే వున్నాయి - 19, 18. సోదర ప్రేమను పాటిస్తే ధర్మశాస్రాన్నంతటినీ పాటించినట్లే కాని ఈ సోదరప్రేమను పాటించడం ఎంతమాత్రం సులభం కాదు. దేవుని ఆత్మే మనకు ఈ యనుగ్రహాన్ని ఈయాలి. ధర్మశాస్త్రం గమ్యం క్రీస్తు. క్రీస్తు గమ్యం ప్రేమ.

8. అంతకాలం సమినాపించింది 18, 11-14

క్రీస్తు మరణోత్తానాలతో నూత్నయుగం ప్రారంభమైంది. అంత్యకాలం, రెండవరాకడ సమిపించింది. పౌలు తన జీవితకాలం ಆ. ప్రభువు రెండవసారి వస్తాడు అనుకొన్నాడు. రేయిముగిసి పగలు