పుట:Puneetha Paul bodhalu 2.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమిపించింది. కనుక నిద్రనుండి మేల్కొనాలి. చీకటిపోయి వెల్లురు వచ్చింది. కనుక శరీర క్రియలు, పాపక్రియలు మానుకోవాలి. ఆత్మక్రియలు చేపట్టాలి. పిశాచంతో పోరాడాలి. క్రీస్తుని ధరించాలి. అతనితో ఐక్యంగావాలి. ఆయుధాలు చేపట్టాలి. మన ప్రధానాయుధం క్రీస్తే ఈ వాక్యాలు చాల భక్తిమంతమైనవీ. ఇవి పూర్వం అగస్టీను గారికి ప్రేరణం పుట్టించి పరివర్తనం కలిగించాయని వింటున్నాం.

9. యూదులకు కూడ రక్షణం 11,16-27.

ఒక మంచి ఒలీవు చెట్టువుంది. కాని అది సరిగా కాయలు కాయడం లేదు. కనుక దాని కొమ్మలు విరగగొట్టారు. దాని విూద అడవి ఒలీవు చెట్టు కొమ్మలు అంటు కట్టారు. ఈ మంచి ఒలీవు యూదులు. కాని వీళ్లు పాలు బోధించే క్రీస్తుని అంగీకరించడంలేదు. దాని మిద అంటగట్టిన అడవి ఒలీవు కొమ్మలు అన్యజాతివారు. వాళ్లు పౌలు బోధవిని యూదుల స్థానాన్ని పొంది దైవ ప్రజల్లో చేరారు. క్రీస్తు నుండి రక్షణంపొందారు. పూర్వ దైవప్రజలైన యూదులు క్రీస్తుని నిరాకరించినందున రక్షణను కోల్పోయారు. మరి వీళ్ల పరిస్థితి ఏమౌతుంది? వీళ్లు శాశ్వతంగా రక్షణను కోల్పోవలసిందేనా?


పౌలు మొదట యూదులతోనే క్రీస్తు సందేశబోధ ప్రారంభిం చాడు. వాళ్లు క్రీస్తుని నిరాకరించి నందున అన్యుల దగ్గరికి వెళ్లాడు. ఈ యన్యులు క్రీస్తుని విశ్వసించడంమంచిదే. కాని యూదులగతి ఏమౌతుంది? వాళ్లు కలకాలం రక్షణను కోల్పోతారు అనే అంశాన్ని పౌలు భరించలేడు.

అతడు దైవప్రేరణంతోనే ఈలా చెప్పాడు. యూదుల నిరాకరణం కొంతకాలంవరకే. రెండవ రాకడకు ముందు యిప్రాయేలు ప్రజలు క్రీస్తుని విశ్వసిస్తారు. తండ్రి క్రీస్తుద్వారా వారిని కూడ రక్షిస్తాడు. అందరూ రక్షణం పొందాలనే దేవుని కోరిక. కనుక దేవుడు అందరిపై కృప చూపుతాడు -26.

మంచి ఒలీవుపై అడవి ఒలీవు కొమ్మలను అంటుగట్టిన దేవుడు, దానిపై మంచి ఒలీవు కొమ్మలను గూడ అంటుగట్టకలడు. ఈ కొమ్మలే యూదులు. కనుక వీళ్లకు కూడ రక్షణం కలుగుతుంది.