పుట:Puneetha Paul bodhalu 2.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని అర్ధం. ఆత్మ అనుగ్రహంవల్లనే మనం దేవుణ్ణి చనువుతో నమ్మకంతో నాన్న అని పిలుస్తాం. పూర్వం యూదులు దేవుణ్ణి ఆలా పిలవలేక పోయారు.

దేవుణ్ణి నాన్న అని పిల్చే మనం అతని ఆస్తికి కూడ వారసులం ఔతాం. ఆ యాస్తి మోక్షమే. కాని మనం మొదట క్రీస్తుతో పాటు శ్రమలు అనుభవించాలి. ఆ పిమ్మట అతనితోపాటు మహిమను పొంది మోక్షాన్ని చేరుకొంటాం. ఆత్మ క్రీస్తు ద్వారా మనలను దత్తపుత్రులను చేస్తుంది.

2. మూడు సాక్ష్యాలు 8, 18-27

క్రీస్తుతోపాటు మనం కూడ మహిమను పొందుతాము అనడానికి మూడు సాక్ష్యాలు లేక ఆధారాలు వున్నాయి. మొదటిది, సృష్టి నరుల మహిమ కొరకు ఎదురుచూస్తుంది. తాను కూడ ఆ మహిమలో పాలు పొందాలని కోరుకొంటుంది. పూర్వం ఆదాము పాపం చేసినప్పుడే దేవుడు దాన్ని శపించాడు - ఆది 3,17. కాని దానికి కొంత నిరీక్షణను (ఆశను) మిగిల్చాడు. కడన సృష్టి కూడ నరుల మహిమలో పాలు పొంది స్వాతంత్ర్యాన్ని పొందుతుంది. ఆ స్వాతంత్ర్యం కోసం అది బాధతో మూలుగుతూ వుంది. ఈలా సృష్టి మనం మహిమను పొందుతామని సాక్ష్యమిస్తుంది.

రెండవది, మనలోని నమ్మకం సాక్ష్యమిస్తుంది. - 8, 23-25. మనం మహిమను పొందుతామనే నిరీక్షణం ෂීජු నమ్మకం మనలో వుంది. ఇది మనకు మహిమ లభిస్తుందని రుజువు చేస్తుంది.

మూడవది, ఆత్మ మనకు మహిమ లభిస్తుందని సాక్ష్యమిస్తుంది 8, 26-27. మనంతట మనం ప్రార్ధన చేసికోలేం. ఆత్మ బాధపడుతూ మన కొరకు ప్రార్ధన చేస్తుంది. నరులు రక్షణం పొందాలి అనే దేవుని కోరిక నెరవేరాలనే ఆత్మ ప్రార్ధన. తండ్రి ఆత్మ ప్రార్థనను వెంటనే గుర్తించి నరులకు రక్షణను దయచేస్తాడు. ఈలా ఆత్మకూడ మనం క్రీస్తుతోపాటు మహిమను పొందుతామని నిరూపిస్తుంది.

3. మనం మహిమను పొందాలనే దేవుని కోరిక 8,28-30

దేవుడు అన్నీ మనకు మంచినే జరిగించేలా చేస్తాడు. కనుకనే మనం అతన్ని ప్రేమిస్తాం. దేవుడు అనాదికాలం నుండి తన మంచి