పుట:Puneetha Paul bodhalu 2.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈలా చెడ్డను చేయడమనే దౌర్భాగ్యం నుండి మనలను రక్షించే దెవరు? మనంతట మనం ఈ చెడ్డవైపు మొగ్గడమనే బలహీనతను తప్పించుకోలేం. క్రీస్తు వరప్రసాదం మనలను ఆదుకోవాలి. అతని అనుగ్రహం మనలను కాపాడాలి.

7. ఆత్మశక్తి - 8

పౌలు ఎన్మిదవ అధ్యాయంలో ఆత్మనుగూర్చి చాల విషయాలు చెప్పాడు. ఇక్కడ ప్రధానంగా రెండంశాలు వున్నాయి.

1. క్రైస్తవ జీవితంలో ఆత్మ ప్రాధాన్యం 8,1-18

కొందరు శరీరానుసారంగా జీవిస్తారు. వీళ్లు పాపపు నరులు, దేవునికి విరోధులు. లోకాశల్లో తగులుకొని వుంటారు. వారికి మరణం ప్రాప్తిస్తుంది. మరి కొందరు ఆత్మానుసారంగా జీవిస్తారు. వీళ్లు ఆధ్యాత్మిక నరులు. వీళ్లకు జీవం ప్రాప్తిస్తుంది.

తండ్రి క్రీస్తుని ఆత్మద్వారా లేపాడు. క్రీస్తుకి పునర్జీవాన్ని ఇచ్చింది ఆత్మే. తండ్రి అదే ఆత్మద్వారా మృతులమైన మనలను కూడ జీవంతో లేపుతాడు.

ఉత్థాన క్రీస్తు మనకు ఆత్మను దయచేస్తాడు. ఆత్మ మన హృదయాల్లో వసిస్తూ మనలను నడిపిస్తుంటుంది. క్రైస్తవుడు ప్రధానంగా ఆత్మానుభవం కలవాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ మనకు నాయకుడు కావాలి.

2. దత్తపుత్రత్వం, పరలోక మహిమ 8,14-30
ఇక్కడ మూడంశాలు వున్నాయి.
1. దత్తపుత్రత్వం 8,14-17

ఆత్మ మనలను దేవునికి బిడ్డలనుగా చేస్తుంది. పిశాచం బిడ్డల్ని పిశాచమే నడిపిస్తుంది. దీనికి భిన్నంగా దేవుని బిడ్డలను దేవుని ఆత్మ నడిపిస్తుంది.

పూర్వవేదంలో యూదులు మేము, దేవునికి దాసులం అనుకొన్నారు. దేవుణ్ణి చూచి భయపడ్డారు. నూత్న వేదంలో మనం దేవుణ్ణి చూచి భయపడం. చనువుతో అతని దగ్గరికి వెళ్తాం. ఆత్మ మనలను దేవునికి దత్త పుత్రులను చేసి అతన్ని చనువుతో "అబ్బా" అని పిల్చేలాగ చేస్తుంది. ఈ మాట అరమాయిక్ పదం. దీనికి నాన్న