పుట:Puneetha Paul bodhalu 2.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
3. క్రీస్తుని విశ్వసించడం ద్వారానే రక్షణం 3,21-31

ఈ భాగం రోమియోయుల జాబులోని ప్రధాన సందేశాన్ని సంగ్రహంగా వివరిస్తుంది. ఇక్కడ మూడంశాలు వున్నాయి. వాటిని సంగ్రహంగా పరిశీలిద్దాం.

1. తండ్రి నీతి 3,21-24

న్యాయస్థానంలో న్యాయాధిపతి ఒకణ్ణి నిర్దోషిగా ప్రకటిస్తాడు. ఆలాగే దేవుడు నరుణ్ణి నిర్దోషిగా ప్రకటించాడు. ఈ నిర్దోషత్వమే, అనగా పాపరాహిత్యమే నీతీ. ఇదే రక్షణం. ఈ నీతి లేక రక్షణానికి హీబ్రూలో "సెడెకా" అనీ గ్రీకులో “డెకాయెుసునీ’ అని పేర్లు తండ్రినీతి నరుని నీతికూడ వున్నాయి. తండ్రి నీతి ఏమిటి? క్రీస్తుద్వారా, అతని మ్లరణోత్థానాలద్వారా, నరులను రక్షించడం. నరుని నీతియేమిటి? క్రీస్తుని విశ్వసించి అతని నుండి రక్షణాన్ని పొందడం. లోకాంతంలో నరులు ప్రకాశవంతమైన దేవుని సాన్నిధ్యంలోకి రావాలి. కాని పాపం ద్ద్వారా వాళ్లు ఆ సాన్నిధ్యాన్ని కోల్పోయారు -23. ఇప్పుడు మళ్లా క్రీస్తు మరణ ఫలితం ద్వారా ఆ సాధ్యాన్ని పొందుతారు.

2. క్రీస్తు సిలువమరణం ద్వారా 3,25-26

పూర్వవేదంలో దేవాలయంలోని కరుణాఫలకం మిద ఎడ్ల నెత్తురు చల్లి నరుల పాపాలకు పరిహారం చేసారు - లేవీ 16, 14-16, తండ్రి క్రీస్తుని ఈ కరుణాఫలకంగా చేసాడు - 25. సిలువమివాద వ్రేలాడే క్రీస్తు కరుణాఫలకంలా వున్నాడని భావం. అనగా అతడు మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేవాడు అయ్యాడు. అతని సిలువమరణం ద్వారానే గదా మనకు పాపపరిహారం జరిగింది. నీతి లేక రక్షణాన్ని మనంతట మనం పొందలేం. అది తండ్రినుండి క్రీస్తు మరణం ద్వారా రావలసిందే.

3. క్రీస్తునందలి విశ్వాసంద్వారా రక్షణం 3,27-31

యూదులు ధర్మశాస్త్రం ෂයීඨියදී పుణ్యక్రియలద్వారా రక్షణం కలుగుతుంది అనుకొన్నారు. ధర్మశాస్తాన్ని పాటించేది తామే కనుక రక్షణం తమకు మాత్రమే లభిస్తుంది అనుకొన్నారు. కాని ఇది పొరపాటు. రక్షణం క్రీస్తు నుండి రావలసిందే. రక్షణం ధర్మశాస్తాన్ని అనుసరించి చేసిన పుణ్య క్రియలను బట్టి రాదు. క్రిస్తుపట్ల విశ్వాసం