పుట:Puneetha Paul bodhalu 2.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
2. ప్రారంభవాక్యాలు 1,1-7

ఈ జాబు ప్రారంభం గంభీరంగా వుంటుంది. కొన్ని వివరాలు చూద్దాం.

1. పౌలుకి మూడు బిరుదాలు వున్నాయి. మొదటిది, అతడు యేసు క్రీస్తు సేవకుడు. సువిశేషబోధద్వారా క్రీస్తుకి సేవలు చేసే దాసుడయ్యాడు. అతడు అబ్రాహాము, మోషే, బాధామయ సేవకుడు మొదలైన వారి కోవలో వచ్చినవాడు. రెండవది, డమస్కు త్రోవలో క్రీస్తు అతన్ని అపోస్తులుణ్ణిగా నియమించాడు. ఈ బిరుదాన్ని అతని విరోధులు నిరాకరించారు. కనుక పౌలు తన్మతాను సమర్ధించుకొన్నాడు. మూడవది, అతడు క్రీస్తు సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడినవాడు. ప్రభువు యిర్మీయాను లాగ మాతృగర్భంనుండే అతన్ని ఎన్నుకొన్నాడు - గల 1, 15.

2. క్రీస్తుని గూర్చిన ఈ రక్షణ సందేశాన్ని ప్రవక్తలు ముందుగానే పూర్వవేదంలో తెలియజేసారు. వారి ప్రవచనాలు మెస్సీయాను గూర్చి తెలియజేస్తాయి.

3-4 శారీరక రీత్యా క్రీస్తు దావీద్దు కుమారుడు. కాని పరిశుద్ధపరచే ఆత్మశక్తిరీత్యా, ఉత్థానంద్వారా, దేవుని కుమారుడు. అనగా అతడు దేవుని శక్తి కలవాడు.

5. దేవుడు డమస్కు త్రోవలో పౌలుకి అనుగ్రహమూ అపోస్తులత్వము ఇచ్చాడు. అన్ని జాతుల ప్రజలు క్రీస్తుని విశ్వసించి అతనికి విధేయులయ్యేలాగ చేయడం పౌలు పని. విధేయులు కావడం అంటే క్రీస్తుని రక్షకుణ్ణిగా అంగీకరించడం. ఇది వేదబోధ వినడంతో ప్రారంభమౌతుంది. క్రీస్తుని విశ్వసించి రక్షకుణ్ణిగా అంగీకరించడంతో ముగుస్తుంది.

6. రోములోని గ్రీకు యూదప్రజలు కూడ క్రీస్తుని విశ్వసించి అతనినుండి రక్షణం పొందేవాళ్లు. ఈ సంఘాన్ని పౌలు స్థాపించలేదు.

7. పూర్వవేదంలోని యూదులు దేవునికి ప్రియులు, పరిశుద్దులు. రోముక్రైస్తవులు కూడ ఆలాంటి వాళ్లే క్రీస్తుద్వారానే వారికి ఈ భాగ్యం కలిగింది. వారికి దేవుని అనుగ్రహం లభిస్తుంది. క్రీస్తు సిలువ మరణం ద్వారా పాపపరిహారం లభిస్తుంది. ఇదే సమాధానం.