పుట:Puneetha Paul bodhalu 2.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వారా వస్తుంది. ఈ విశ్వాసం ద్వారా క్రీస్తుని నమ్మి అతనిమిద ఆధారపడతాం. యూదులూ అన్యజాతివారూ కూడ క్రీస్తుని విశ్వసించి, అతనిలోనికి జ్ఞానస్నానం పొంది రక్షణను సాధించవలసిందే.

ఫలితాంశం ఏమిటంటే, నీతిని లేక రక్షణను ఇచ్చేది తండ్రి. అది క్రీస్తు మరణోత్థానాల ద్వారా వస్తుంది. నరులు వాళ్లత్తరపున వాళ్లు క్రీస్తుని విశ్వసించి అతనిలోనికి జ్ఞానస్నానం పొందాలి. క్రీస్తు మరణం తర్వాత ధర్మశాస్త్రం మనలను రక్షించదు. అది మనలను రక్షిస్తే క్రీస్తు సిలువమివాద చనిపోవడమెందుకు?

4. ఇద్దరు ఆదాములు 5,12-21

ఈ భాగంలో పౌలు ఇద్దరు ఆదాములను ఒకరితో ఒకరిని పోలుస్తున్నాడు. మొదటి ఆదాము పాపమూ మృత్యువూ తెచ్చిపెట్టాడు. ఈ మృత్యువు భౌతికమైన చావూ, ఆధ్యాత్మికమైన చావూకూడ. రెండవ ఆదాము వరప్రస్తాదమూ జీవమూ తెచ్చాడు. ఈ యిద్దరూ సామూహిక వ్యక్తులు. వారిలో మన మందరం ఇమిడేవున్నాం. మొదటి ఆదాము పాపపు నరజాతినీ రెండవ ఆదాము ఉద్ధరింపబడిన నరజాతినీ సూచిస్తారు.

ఆదాము చేసిన ఒక్కపాపంద్వారా చాలమందికి శిక్షపడింది. కాని క్రీస్తు చేసిన ఒక్క నీతి క్రియద్వారా, అనగా అతని సిలువమరణం ద్వారా నరులు చేసిన చాలపాపాలకు పరిహారం జరిగింది. తొలి ఆదాముకంటే రెండవ ఆదాము ఘనుడు.

పాపం, మృత్యువు క్రూరులైన నియంతల్లాగ లోకంలో త్రి ప్రవేశించి నరజాతిని నాశంచేసాయి. క్రీస్తు ఉద్గారకుడుగా వచ్చి నరజాతిని మళ్లా కాపాడాడు.

ఆదాము నుండి మోషే దాక రెండు వేలయేండ్లపాటు శాపం. మోషే నుండి క్రీస్తుదాక రెండు వేలయేండ్ల పాటు ధర్మశాస్త్రం. క్రీస్తు నుండి ఇప్పటిదాక రెండువేల యేండ్లపాటు వరప్రసాద భాగ్యం. కనుక ఆ ప్రభువుకి మనం వందనాలు చెప్పుకోవాలి.

5. జ్ఞానస్నానం 6,3–11

జ్ఞానస్నానంలో మనం క్రీస్తుతో పాటు మరణిస్తాం. అతనితో పాటు ఉత్థానమౌతాం. ఏలా? తొలిరోజుల్లో ప్రజలను మడుగులోమంచి