పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ

1956 జనవరిలో కేంద్రప్రభుత్వం ఫజల్‌అలీ కమీషన్‌ నివేదికని ప్రకటించింది. అప్పుడే హైద్రాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు కాంగ్రేస్‌ అధ్యక్షుడు యు.ఎన్‌.థేబర్‌కు ఉత్తరం రాసిండు. విలీనానికి తాను వ్యతిరేకమని, విలీనం వల్ల ఒక ప్రత్యేక సంస్కృతి కలిగిన తెలంగాణ అన్ని విధాల నష్టపోతదని, ఈ ఉత్తరం మధ్యంతర రిపోర్టుగా భావించాలని వేడుకున్నడు. కాని అనేక కుట్రలు, కుయుక్తులు, ఎత్తుగడలతో చేసిన పన్నాగం కాబట్టి ఎవరూ దీన్ని ఆపలేకపోయిండ్రు. ఆంధ్ర, హైద్రాబాద్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో నలుగురు పెద్దల సమక్షంలో ఒక ఒప్పందం చేసుకున్నరు. ఇదే చరిత్రలో పెద్దమనుషుల ఒప్పందంగ మారింది.

హైద్రాబాద్‌ పెద్ద మనుషులు: బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకట రంగారెడ్డి డా॥ మర్రి చెన్నారెడ్డి, జె.వి. నర్సింగరావు.

ఆంధ్ర పెద్ద మనుషులు: బెజవాడ గోపాల్‌ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న

1956 జులై 19న పెద్దమనుషుల ఒప్పందం మీద సంతకాలు చేసిండ్రు. ఆ క్షణంలోనే బూర్గుల రామకృష్ణారావు “నా మరణశాసనం మీద నేనే సంతంక చేసిన” అని ప్రకటించుకుండు. ఏదైతే ఏముంది పెద్దమనుషుల ఒప్పందాన్ని భారత పార్లమెంట్‌ ఆమోదించింది. 1956 మార్చి 5న నిజాంబాద్‌లో భారత్‌ సేవక్‌ సమాజ్‌ వారు ఏర్పాటు చేసిన సభకు నెహ్రు హాజరై తెలంగాణ విషయంలో అమాయకపు ఆడపిల్లని తుంటరి అబ్బాయికిచ్చి వివాహం చేయడం సరికాదని తన ఆవేదనని వ్యక్తం చేసిండు. రెండు ప్రాంతాల నాయకులు 14 అంశాల మీద ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్టు ప్రకటించిండు. అయితే ఆంధ్రుల అసలు రంగు తెలిసిన మహానాయకుడు భారత తొలి ప్రధానమంత్రి జవవోర్‌లాల్‌ నెహ్రు భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను వ్యతిరేకించిండు. డా॥ బి.ఆర్‌. అంబేద్మర్‌ కూడ ఈ విషయాన్ని వ్యతిరేకించిండు. వాస్తవానికి ఈ విలీనం ఎవరికీ ఇష్టం లేదు ఒక్క సీమాంధ్ర నాయకులకు తప్ప. ఆ విలీన సభలో నెహ్రు మాట్లాడుతూ 'తెలంగాణ ప్రజలు ఆంధ్రతో కలిసి ఉండడం ఇష్టం లేకపోతే భవిష్యత్తులో ఎప్పుడైన ఆలు మగలు విడాకులు తీసుకొని విడిపోయినట్టు

22 * ప్రత్యేక తెలంగాణ ఉద్యమం