పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఊరేగింపులో పాల్గొనడానికి బస్సులో హన్మకొండ నుంచి హైద్రాబాద్‌కు బయలు దేరిండు. అప్పటికే హైద్రాబాద్‌లో కాల్పులు జరిగినయన్న వార్తతో బస్సును బోనగిరి దగ్గర ఆపేసిండ్రు. ఊరేగింపు మదీన హోటల్‌ సమీపంలోకి రాంగనే ఎలాంటి హెచ్చరికలు లేకుండ పోలీసులు కాల్ఫులు జరపడంతో అక్కడ ఒక విద్యార్థి చనిపోయిండు. కాల్పుల్లో గాయపడ్డ వాళ్ళను దావఖానలో చేర్చిస్తున్న సమయంలో మరొక విద్యార్థి చనిపోయిండు. ఉస్మానియా ఆస్పత్రికి వచ్చిన హోం మినిస్టర్‌ దిగంబర్‌ రావు బిందు మరికొందరు నాయకులు విద్యార్థులను శాంతించాలని కోరిండ్రు. ఆవేశం చల్లారని విద్యార్థులు ఫతర్‌గట్టి పోలీస్‌స్టేషన్‌ని తగలబెట్టిండ్రు. నగరమంత లాఠిచార్జ్‌లు, కాల్పులతో హోరెత్తింది. కర్ఫ్యూ విధించబడింది. విద్యార్థి నాయకులను నిర్భందంలోకి తీసుకుంది. ఈ ఘటనల్లో దాదాపు 18 మంది విద్యార్థులు చనిపోయినట్టు, వందలాది మంది గాయపడ్డట్టు వార్తలు వచ్చినయ్‌. వారం రోజుల పాటు స్ఫూళ్ళు, కాలేజీలు మూసేసిండ్రు. సామాన్య జనం, స్రీలు, పిల్లలు కూడా చనిపోయిన వాళ్ళలో ఉన్నరు. ముల్మీ సమన్య రాజకీయానికో, మతానికో సంబంధించింది కాదని, తెలంగాణ స్థానిక ఉద్యోగాలకు సంబంధించిన అంశమని ఆవేదనని వ్యక్తం చేసిండ్రు. దీంతో ప్రభుత్వానికి కొంత కనువిప్పు కలిగినట్టయ్యింది.

1958లో నాటి ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రు మాట్లాడుతూ “విశాలాంధ్ర ప్రతిపాదన వెనక దురాక్రమణ పూరిత సామాజ్యతత్వం దాగి ఉన్నదని” వాఖ్యానించిండు.

సీమాంధ్రులు కృష్ణా, గోదావరి నీళ్ళను ఆంధ్రకు తరలించుకపోయే ఎత్తుగడలు ఏస్తరు. అయిన తెలంగాణలో వముందని ప్రచారం చేస్తరు. సింగరేణి నుంచి బొగ్గు, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి టేకును తరలించుకపోతరు. అయినా తెలంగాణలో ఏముందని ప్రచారం చేస్తరు. ప్రపంచంలోనే అత్యంత ధనికుడు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ అని తెలిసినా ఇక్కడ ఏమి లేదని చెప్పుకు తిరిగే నీచ నికృష్టమైన జాతి ఆంధ్రులది. నిజాన్ని దాసి అబద్దాన్ని అందంగా పొదగడం కోసం ఎంతకైన తెగించే దుర్మార్గమైన జాతి ఆంధ్రులదనే భావన తెలంగాణ ప్రజలకు కలిగేలా చేసింది సీమాంధ్రుల ప్రవర్తన. క్రమంగ తెలంగాణ వనరుల మీద తెలంగాణ ప్రజలకు హక్కులు సన్నగిల్లినయ్‌. అధికారం నామమాత్రం అయ్యింది. 1952లోనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుకొని సాధించుకున్న ఆంధ్రులకు తెలంగాణ ఉద్యమం మాత్రం వేర్పాటు ఉద్యమంగ కనిపిస్తది.

అంబటి వెంకన్న * 21