పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రెండు ప్రాంతాలు ఆంధ్ర, తెలంగాణగ విడిపోయి ఎవరి బతుకు వారు బతుకొచ్చు” అనే విషయాన్ని సూచించిండు.

1956 ఆగస్టు 81న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బిల్లుని భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ ఆమోదించి సంతకం చేసిండు. 1956 నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ ర్యాష్టం అవతరించింది. ఈ బతవంతపు విలీనానికి ముందురోజే హైద్రాబాద్‌ రాజ ప్రముఖ్‌ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ తన పదవికి రాజీనామ చేసిండు. సెప్టెంబర్‌ 17, 1948లో ఈ నేలకు విముక్తి జరిగిందని భావిస్తే మల్లా 1956 నవంబర్‌ 1న బలవంతపు బాసింగం కట్టి తెలంగాణను కట్టు బానిసను చేసిండ్రు.

నవంబర్‌ ఒకటి ఆంధ్రప్రదేశ్‌ అవతరణ జరిగి ఆంధ్రులు సంబరాలు జరుపుకుంటే నవంబర్‌ ఒకటిన తెలంగాణ ప్రజలు ద్రోహంతో తల్లడిల్లిండ్రు. నవంబర్‌ ఒకటి తెలంగాణ చరిత్రలో విద్రోహదినంగ మారింది.

ఎందుకంటే ఒప్పందంలో రాసుకున్న ఏ ఒక్కదానికి ఆంధ్రనాయకత్వం కట్టుబడి ఉండలేదు. మొట్ట మొదట రాష్ట్రం పేరులోనే పెద్ద మోసం చేసిండ్రు. 'ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రంగ ఏర్పాటు చేయడానికి బదులు 'ఆంధ్రప్రదేశ్‌ గా మార్చి తెలంగాణ ఉనికి లేకుండ జాగ్రత్త పడ్డరు. చివరికి ఆంధ్ర ఒంటె తెలంగాణని బయటికి గెంటేసినట్టు

అంబటి వెంకన్న * 23