పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెంటనే తెలుగు మాట్లాడే రెండు ప్రాంతాలను భాషా ప్రయుక్త ర్యాష్ట్రంగ ఒక్కటి చేయాలని కొత్త రాగం తీసిండ్రు. లోతుపాతులు తెలువని తెలంగాణ నాయకులను లోతులేసిండ్రు. ఆఖరికి ఆ ఫజల్‌ అలీ కమీషన్‌ కూడ తెలంగాణను ఆంధ్రతో కలపాల్సిన అవసరం లేదని సూచించింది. పైగ అట్ల కలపడం వలన తెలంగాణ నష్టపోతుందని, కొత్త సమస్యలు తలెత్తుతయని కూడ హెచ్చరించింది. అయినా వినకుండ పెద్ద మనుషుల ఒప్పందం ఒకటి చేసి బలవంతంగ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలో విలీనం చేసిండ్రు.

తెలంగాణ జ(ర్రంత నిమ్మలంగ ఉన్నదంటే అది కేవలం 1952 నుంచి 1956 వరకు మాత్రమే. ఈ నాలుగు సంవత్సరాలే తెలంగాణ ప్రజలు స్వేచ్చ, స్వాతంత్ర్యాలతో పాటు ప్రజాస్వామ్య పాలనను అనుభవించిండ్రు. తమని తాము మరిచిపోయి జీవించిండ్రు.


అంబటి వెంకన్న * 19