పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తరిమినట్టు తరిమిండు. ఏగలేక తట్టబుట్ట సదురుకొని వచ్చిన ఆంధ్రులు కర్నూలులో గుడారాలు ఏసుకొని పాలన కొనసాగించిండ్రు.

జరసేపు అదట్ల ఉంచితె నిజాం కాలం నాటి హైద్రాబాద్‌ ఎట్ల ఉందో అట్ల రాష్ట్రంగ అవతరించింది. హైద్రాబాద్‌ రాష్ట్రంలోని పదహారు జిల్లాలలో 142 అసెంబ్లీ నియోజక వర్గాలను ఏర్పాటు చేసిండ్రు. వీటిలో 38 స్థానాలు ద్విసభ్య నియోజకవర్గాలు. ఈ ద్విసభ్య స్థానాలలోనే ఒకదానిలో జనరల్‌ ప్రతినిధి, రిజర్వు ప్రతినిధి ఎన్నికైతడు. మొత్తం 175 మంది శాసన సభ్యులకు గాను తెలంగాణ నుంచి 101 శాసనసభ్యులు ఎన్నిక కావాలె. ఈ విధంగ 1952 ఫిబ్రవరిలో జరిగిన మొదటి ఎన్నికలలో మొత్తం ఐదు పార్టీలు పోటీలో ఉన్నయి. కమ్యునిస్టు పార్టీ మీద నిషేదం ఉండడం మూలంగ పీపుల్స్‌ డెమక్రటిక్‌ ఫెడరేషన్‌ (పి.డి.ఎఫ్‌. ) పేరుతో ఎన్నికలలో పోటి చేసిండ్రు. ఈ ఎన్నికలలో కాంగ్రేసు పార్టీ నుంచి పోటీచేసి గెలిచిన బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యిండు. 1952 మార్చిలో రాజ్‌ప్రముఖ్‌ నిజాం నూతన మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిండు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వి.బి. రాజుకు కార్మికశాఖ మంత్రిగా మంత్రివర్గంలో స్థానం దక్కడం చెప్పుకోదగిన అంశం. పి.డి.ఎఫ్‌ ప్రతిపక్ష హోదాలో ఉండగా స్పీకర్‌గా కాశీనాధరావు వైద్య బాద్యతలు తీసుకుండు.

ఆంధ్రరాష్ట్రంలో అనేక సమస్యలతో అల్లాడుతున్న ప్రకాశం పంతులు ప్రభుత్వం 1954లో కూలిపోయింది. ఆయన స్థానంలో బెజవాడ గోపాల్‌రెడ్డి ముఖ్యమత్రి అయ్యిండు. ఇక లాభం లేదని తెలంగాణ వనరులు, సంపద మీద కన్నుగుట్టిన ఆంధ్రులు అనేక కుట్రలు చేసిండ్రు. విశాలాంధ్రలో ప్రజారాజ్యమని, భాషా ప్రయక్తరాష్ట్రమని కట్టుకథలు అల్లిండ్రు. హైద్రాబాద్‌ల కలిస్తెనే మన బాదలు తీరుతయని అనుకుండ్రు. ఆంధ్రుల పెత్తనం సాగే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసిండ్రు. ఆంధ్రుల దెబ్బకు తట్టుకోలేని కేంద్రం 1958 డిసెంబర్‌ 29న రాష్ట్రాల పునర్విభజన కమీషన్‌ (ఎస్‌.ఆర్‌.సి) ను నియమించి, 1955 సెప్టెంబర్‌ 80లోపు నివేదిక సమర్చించాలని ఆదేశించడం జరిగింది.

కుంజ్రా, ఫనిక్కర్‌లు సభ్యులుగ న్యాయమూర్తి సయ్యద్‌ ఫజల్‌ అలీ కమీషన్‌ అధ్యక్షునిగా పనిని ప్రారంభించింది.

వందల సంవత్సరాలుగ తెలుగు నేలను ఎందరో రాజుల పరిపాలించిండ్రు. ఎన్నో ప్రభుత్వాలు మారినయ్‌. కాని ఏనాడు తెలుగు భాష గుర్తుకు రాలేదు. ఆంధ్రరాష్ట్ర పాలన కర్నూలు గుడారాల్లో సాగుతున్నప్పుడు అప్పుడు గుర్తుకొచ్చింది తెలుగు భాష.

18 * ప్రత్యేక తెలంగాణ ఉద్యమం