పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1952 ముల్ళీ ఉద్యమం

తెలంగాణ వనరుల మీద కన్నేసిన ఆంధ్రులు ఆశగొంటి తనంతో 1947కు ముందు నుంచే తెలంగాణ ప్రాంతానికి వలస బాట పట్టిండ్రు. 1948 నుంచి 1952 మధ్య కాలంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వలసలు వరదలై పొంగినయ్‌. అప్పుడే లంచాల సంస్కృతిని పెంచి పోషించిండ్రు. 1952లో శాసనసభ్యుడైన రామాచారి అనే నాయకుడు హైద్రాబాద్‌ హితరక్షణ సమితిని స్థాపించి గైర్‌ముల్కీ గోబ్యాక్‌ అంటూ నినదించిండు. 1952లో వరంగల్‌ జూన్‌ 21న ప్రారంభమైన ముల్కీ ఉద్యమం ప్రత్యేకించి ఆంధ్రుల వ్యవహారశైలికి వ్యతిరేకంగ, పోలీసుచర్య ద్వార అక్రమంగ తెలంగాణ ఉద్యోగాల్లో చేరినవాళ్ళు వెనకకు వెళ్ళిపోవాలని ఐదు రోజులపాటు విద్యార్థులు నిరసన తెలిపిండ్రు. ఆగస్టు 7న ఖమ్మంలో ఈ ఉద్యమం జరిగింది. ఆగష్టు 8న వరంగల్‌ జిల్లా మానుకోటలో విద్యార్థులు గైర్‌ముల్మీ గోబ్యాక్‌ అంటూ సమ్మెజేసిండ్రు. ఆగష్టు 26న జంటనగరాల్లో విద్యార్థుల సమ్మె మొదలైంది. తరగతులు బహిష్కరించి నాన్‌ముల్మీలకు వ్యతిరేకంగ ఊరేగింపు జరిపిండ్రు. ముల్మీ సర్టిఫికెట్ల జారీలో తగిన జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు హామి ఇచ్చిండు. అయినప్పటికి పరాయి వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నందువల్ల విదార్థులు తీవ్రంగ ప్రతిఘటించిండ్రు. విద్యార్థి ఐక్య కార్యాచరణను ప్రకటించిండ్రు. హన్మకొండ హైస్కూల్‌లో శాంతియుతంగ సభ జరుపుకుంటున్న విద్యార్థులమీద పోలీసులు లాఠీచార్జ్‌ చేసిండ్రు. విద్యార్థులు తిరగబడి రాళ్ళు విసరడంతో పోలీసులు గాయపడ్డరు. ఈ విషయం హైద్రాబాద్‌ విద్యార్థులకు తెలిసితెల్లారేసరికి సైఫాబాద్‌ కాలేజ్‌ నించి పెద్ద ఊరేగింపుగ బయలుదేరిండ్రు. నిజం కాలేజ్‌ గేట్లు విరగ్గొట్టి లోపలికి దూసుకపోయిండ్రు. ఈ ఊరేగింపులో కొందరు స్మూలు పిల్లలు కూడ ఉన్నరు. కాలేజ్‌లోని బెంచీలు, కుర్చీలు ధ్వంసం చేసిండ్రు. వీళ్ళకు తోడు కాలేజ్‌ విద్యార్థులు జమైండ్రు. అందరు కలిసి “క్షి సాంబర్‌ గోబ్యాక్‌, గోంగూర పచ్చడి గోబ్యాక్‌” అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఆబిడ్స్‌ అంత కలియ తిరిగిండ్రు. క్రమంగ తెలంగాణేతరులకు వ్యతిరేకంగ హైద్రాబాద్‌ దాక ఉద్యమం విస్తరించింది.

సెప్టెంబర్‌ 4న హైద్రాబాద్‌ పాతబస్తీలోని సిటికాలేజ్‌ విద్యార్థుల్లో ఒకరైన కేశవరావ్‌ జాదవ్‌ కూడా ఊరేగింపులో పాల్గొన్నడు. ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌ ఈ

20 * ప్రత్యేక తెలంగాణ ఉద్యమం