పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భూములను వదిలిపెట్టవలసి వచ్చింది.

నిజాం రాజ్యంలోని జాగీర్లతో పాటు హాలిసిక్కా నాణెం కూడ రద్దయ్యింది. ఆ తర్వాత 1950 జనవరి 26న సీనియర్‌ సివిల్‌ అధికారి ముల్లర్‌ కాడింగ్‌ వెల్లోడి ముఖ్యమంత్రిగ పౌరప్రభుత్వ పాలన సాగింది.

నిజాం ప్రభువును రాజ్‌ప్రముఖ్‌ (ఇప్పటి గవర్నర్‌) గా నియమించిండ్రు. ఇందుకు గాను నిజాంకు భారతం ప్రభుత్వం ఏటా 1.25 కోట్ల రూపాయలను రాజ భరణంగా చెల్లించడానికి అంగీకరించింది.

1952 సాధారణ ఎన్నికల ద్వార బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యిండు. 1956 నవంబర్‌1 వరకు నిజాం చేతుల మీదుగ పాలన సాగింది. మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ తెలంగాణల ఎవరైతే ఉండకూడదని అనుకుండో అట్లాంటి ఆంధ్రుల పాలనని కండ్లార చూసిండు. చెమ్మగిల్లిన కండ్లతో1967 ఫిబ్రవరి 24న చనిపోయిండు.

అప్పుడు నిజాం దహన సంస్కారాలకు ప్రజాకవి కాళోజీ నారాయణ రావు కూడ పోయిండు. ఆ సంధర్భంలో కాళోజీ “నేను పోరాడింది వ్యక్తికి వ్యతిరేకంగ కాడు, వ్యవస్థకు వ్యతిరేకంగ” అనడమే కాకుండ, ఈనాటి ఈ పాలకుల కంటే నిజాం చాల నయం” అన్నడు కాళోజీ.

నిజాం మరణంతో హైద్రాబాద్‌ నగరం శోకసముద్రం అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పదిరోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.

16 * ప్రత్యేక తెలంగాణ ఉద్యమం