పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1948 తర్వాత తెలంగాణ

1947 ఆగష్టు 15న దేశవ్యాష్తంగ స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నరు. కాని నిజాం పాలనలోని తెలంగాణ ప్రజలు కమ్యునిస్థలు, రజాకార్ల దాడులతో కన్నశెరలతో ఊర్లు విడిచిపెట్టి వలసబాటలు పట్టిండ్రు. దేశం నలుమూలల నుంచి ఎవ్వరు తెలంగాణలో అడుగుపెట్టినా, వాళ్ళందరి కన్నతల్లి లెక్కచూస్తది తెలంగాణ నేల. కూడు, గూడునిచ్చి బతుకుదెరువు సూపిస్తది. వరదల్లో సర్వం కోల్పోయిన కోస్తాంధ్ర ప్రజలకు కడుపునిండ బువ్వబెట్టి ఆదుకున్న సందర్భాలు అనేకం ఉన్నయి. కాని అదే తెలంగాణ బిడ్డలు దేశముఖ్‌ల దౌర్జన్యాలు, రజాకార్ల ఆగడాలకు తట్టుకోలేక పక్కన ఉన్న ఆంధ్ర ప్రాంతానికి పోతే మంచినీల్లు ఇచ్చిన దిక్కులేదు సరికదా ఉన్నకాడికి దోసుకున్న సంఘటనలు కోకొల్లలు.

ముఖ్యంగ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగ తెలంగాణకు ఒక విచిత్రమైన పరిస్థితి తలెత్తింది. 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగే దాక తెలంగాణ ప్రాంతాన్ని బయటివాళ్ళే పాలించిండ్రు. కొంతకాలం సైనిక పాలన మరికొంత కాలం వెల్లోడీల పాలన కొనసాగింది. ఈ సమయంలోనే ఆంధ్ర ప్రాంతం నుంచి అధికారులుగా వచ్చి ఇక్కడి వనరుల్ని ఉద్యోగాలను కొల్లగొట్టిండ్రు. తెలంగాణ సంపదను దోసుకుపోవడమే లక్ష్యంగ ఇక్కడ చేరిండ్రు. దోపిడి భావజాలం కలిగిన ఆంధ్రుల తమిళనాడులో ఇమడలేకపోయిండ్రు. గొంతెమ్మ కోర్కెలు కోరిన ఆంధ్రులను ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి తమిళులు తరిమేసిండ్రు. రాయలసీమ రక్షణ కొరకు 1987 నవంబర్‌ 16న శ్రీబాగ్‌ ఒప్పందం చేసుకున్నరు. మద్రాస్‌లోని నాగేశ్వరరావు ఇంటిపేరే శ్రీబాగ్‌. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1952 అక్టోబర్‌ 19న మద్రాస్‌లోని బులుసు సాంబమూర్తి ఇంట్లో పొట్టి శ్రీరాములు దీక్ష చేపట్టిండు. 58 రోజులు దీక్షచేసి డిసెంబర్‌ 15న కన్ను మూసిండు.

శ్రీరాములు త్యాగఫలితంగ 1958 అక్టోబర్‌ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ముఖ్యమంత్రిగ టంగుటూరి ప్రకాశం పంతులు, ఉప ముఖ్యమంత్రిగ నీలం సంజీవరెడ్డి ఎన్నికయ్యిండు. ఆంధ్రలో రాజధాని నిర్మాణం జరిగేవరకు మద్రాసును ఉమ్మడి రాజధానిగ చేయాలని అడిగిండ్రు. మద్రాసు ముఖ్యమంత్రి రాజాజి 24 గంటల్లో మద్రాసు ఖాలీ చేయాలని ఆజ్ఞాపించిండు. పిచ్చి కుక్కల్ని

అంబటి వెంకన్న * 17