పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారతయూనియన్‌లో హైద్రాబాద్‌ విలీనం

1948 అగస్టు 21 నిజాంరాజు ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసిండు. భారత చర్యలను ఆపాలని కోరిండు. ఐక్యరాజ్యసమితి హైద్రాబాద్‌ సమస్యను ఎజెండాలో చేర్చింది. సెప్టెంబర్‌ 20న చర్చించాలని నిర్ణయించింది. కాని నెహ్రు ప్రభుత్వం హైద్రాబాద్‌ను భారతయూనియన్‌లో విలీనం చేసే బాధ్యతని హోంమినిస్టర్‌ సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌కు అప్పగించింది. దీంతో 1948 సెప్టెంబర్‌ 18న జనరల్‌ జయంత్‌నాధ్‌ ఆధ్వర్యంలోని భారతసైన్యం హైద్రాబాద్‌ సంస్థానంలో ప్రవేశించింది. దక్షణ ప్రాంత కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ మహారాజా రాజేంధ్ర సింహ అధ్వర్యంలో సంస్థానాన్ని అన్ని వైపుల చుట్టు ముట్టినయ్‌. దీంతో నిజాం రాజు 'హైద్రాబాద్‌ను బారత యూనియన్‌లో కలుపుతున్నట్టు దక్కన్‌ రేడియో ద్వార సమాచారం అందించిండు. తన సైనికాధికారి ఏల్‌ ఆండ్రూస్‌ను లొంగిపోవాల్సిందిగా ఆజ్ఞాపించిండు. అప్పటి వరకు అనేక అరాచకాలకు పాల్పడుతున్న కాశీంరజ్వీని బంధించి సికింద్రాబాద్‌ పరిధిలోని తిరుమలగిరిలో గల సైనిక కారాగారంలో బంధించింది. రజాకార్‌ సేన లొంగి పోయింది. కొందరు కమ్యునిస్టులు సైతం లొంగిపోయిండ్రు. ఈ విధంగ 1948 సెప్టెంబర్‌ 17న పోలీసుచర్య (ఆపరేషన్‌ పోలో) ద్వార హైద్రాబాద్‌ సంస్థానం భారతయూనియన్‌లో విలీనం అయ్యింది.

జె.ఎన్‌. చౌదరి మిలిట్రి గవర్నర్‌గా 1949 వరకు ప్రభుత్వం నడిచింది. 1949 ఫిబ్రవరి 6న చౌదరి విడుదల చేసిన ఫర్మానతో నిజాం స్వంత ఆస్తులైన సర్ఫేఖాస్‌


అంబటి వెంకన్న * 15