పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారతదేశానికి స్వాతంత్ర్యం

1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత జవహర్‌లాల్‌ నెహ్రు భారత తొలి ప్రధానిగా కేంధ్రంలో ప్రభుత్వం ఏర్పడింది. దేశంలోని సంస్థానాలన్ని భారత యూనియన్‌లో విలీనమైనయి. హైద్రాబాద్‌ సంస్థానాధీశుడు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఎటూ తేల్చుకోలేని స్థితిలో తటస్థంగ ఉన్నడు. హైద్రాబాద్‌ సంస్థానంలో హిందువులు, ముస్తీంలు అనే బేధభావం ఏనాడు తలెత్తింది లేదు. ప్రజలు వాళ్ళకు నచ్చిన భాషని, నచ్చిన మతాన్ని స్వేకరించడంలో పూర్తి స్వేచ్చ ఉన్నది. సంపూర్ణ మత సామరస్యాన్ని పాటించిన నిజాం నవాబు భారత యూనియన్‌లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున మత దురహంకారి అయిన కాశీంరజ్వీ రజాకార్‌ (స్వయం సేవక్‌) సైన్యాన్ని తయారు చేసిండు. నిజాం ప్రధాని లాయఖ్‌ అలీ కూడ కాశీంరజ్వీని సమర్థించిండు. దీంతో రజ్వీ బలవంతంగ మత మార్చిడులు చేసే ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తూ సామాన్య జనాన్ని కమ్యునిస్టులను ఊచకోతలు కోయడం, ఊర్లు తగలబెట్టడం వంటి చర్యలకు పూనుకోవడంతో కమ్యునిస్థులు రజాకార్లను ఎదుర్కొంటు పోరాటానికి సిద్దమయ్యిండ్రు, కమ్యునిస్థులు కూడ స్వతంత్ర కమ్యునిస్టు రాజ్యం వస్తుందని కలల గన్నరు. ముస్లీం రాజ్య స్థాపన చేయాలని కాశీం రజ్వీ కమ్యునిస్టు రాజ్యం ఆవిర్భవిస్తుందని కమ్యునిస్టులు పరస్పర దాడులు చేసుకోవడంలో ఎందరో సామాన్య ప్రజలు చనిపోయిండ్రు. ఈ దశలో హైద్రాబాద్‌ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్చ్బడం కోసం జె.ఎన్‌. చౌదరి నేతృత్వంలో రాష్ట్రంలో సైనిక పరిపాలన ఏర్పడింది. పోలీసు చర్యలో భాగంగ కమ్యునిస్టులు, రజాకార్ల పరస్పర దాడుల్లో దాదాపు ఐదువేల మంది ప్రాణాలు కోల్పోయిండ్రు.

నెహ్రు ప్రభుత్వంలోని పటేల్‌ సైన్యాలు కమ్యునిస్టులను అణిచివేయడం కోసం గాలింపు చర్యలను తీవ్రతరం చేసింది. ఆంధ్రా కమ్యూనిస్టు పార్టీ నాయకుల కుట్రలు (గ్రహించిన నెహ్రూ హైదరాబాదు విలీనం కోసం మోహరించిన సైనిక బలగాలను మరికొంత కాలం ఉంచాలని నిర్ణయించిండు. ఈ లోపు తమ ఆటలు సాగవని (గ్రహించిన కొందరు కమ్యునిస్టులు లొంగిపోయిండ్రు. మరికొందరిని సైన్యం నిర్భంథంగా తీసుకొచ్చి జైళ్ళలో బంధించింది.

14 * ప్రత్యేక తెలంగాణ ఉద్యమం